750కిపైగా మార్కులొస్తేనే ఐఐటీలో సీటు

23 Jun, 2015 04:00 IST|Sakshi
ఐఐటీ బాంబే

* ఇంటర్ కటాఫ్ మార్కులను ప్రకటించిన ఐఐటీ బాంబే
* జనరల్, ఓబీసీ విద్యార్థులకు 750 మార్కులు
* ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 700 మార్కులు రావాల్సిందే

సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లలో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో సాధించి ఉండాల్సిన కటాఫ్ మార్కులను ఐఐటీ బాంబే ప్రకటించింది. ఐఐటీ ప్రవేశాలకు వివిధ రాష్ట్రాల ఇంటర్ బోర్డుల్లో పరిగణనలోకి తీసుకునే కటాఫ్ మార్కులను వెల్లడించింది.

బోర్డులవారీగా కటాఫ్ మార్కుల వివరాలను తమ వెబ్‌సైట్‌లో (http://jeeadv.iitb.ac.in) పొందుపరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డులు, రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయాలకు (ఆర్‌జీయూకేటీ) చెందిన విద్యార్థులు సాధించాల్సిన మార్కులను పేర్కొంది.
 
ఇదీ ప్రాతిపదిక..
ఐఐటీలో సీటు పొందాలంటే విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకుతోపాటు ఇంట ర్మీడియట్‌లో టాప్-20 పర్సంటైల్‌లో లేదా జనరల్, ఓబీసీ-నాన్ క్రీమీలేయర్ (ఎన్‌సీఎల్) విద్యార్థులు ఇంటర్‌లో 75 శాతం మార్కు లు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే 70 శాతం మార్కులను సాధించి ఉండాలి. ఈ రెండింటిలో ఏ ఒక్కదాని పరిధిలో ఉన్నా చాలు. అలాంటి విద్యార్థులకే వారి జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో ఒక్కో రకమైన మార్కుల విధానం ఉంది. కాబట్టి సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి మార్కులను (500) ప్రామాణికంగా తీసుకొని వివిధ ఇంటర్మీడియట్ బోర్డులలో ప్రతి 500 మార్కులకు టాప్-20 పర్సంటైల్ ఉండాల్సిన మార్కులను, 75 శాతం, 70 శాతంతో పరిగణనలోకి తీసుకునే మార్కులను వెల్లడించింది.

అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్‌లో 1000 మార్కుల విధానం ఉంది. వాటి ప్రకారం కాకుండా ప్రతి 500 మార్కుల కు సాధించాల్సిన మార్కులను వెబ్‌సైట్‌లో పొందుపరించింది. అయితే రాష్ట్ర విద్యార్థులు ప్రకటిత మార్కులను రెట్టింపు చేసి లెక్కించుకోవాల్సి ఉంటుందని ఐఐటీ నిపుణుడు ఉమాశంకర్ తెలిపారు. అలా లెక్కించిన వివరాలివీ..

>
మరిన్ని వార్తలు