మహిళను తన్నిన ఎంపీపీ అరెస్టు

19 Jun, 2018 01:55 IST|Sakshi

ఇందల్‌వాయి: ఇల్లు అమ్మకం విషయంలో మహిళను తన్నిన నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి ఎంపీపీ ఇమ్మడి గోపిని పోలీసులు సోమవా రం అరెస్టు చేశారు. నిందితుడిని న్యాయమూర్తి ఉమామహేశ్వరి ఎదుట హాజరుపర్చగా 14 రోజులపాటు రిమాండ్‌ విధించారు. గౌరారం గ్రామానికి చెందిన వడ్డె రాజవ్వకు 11 నెలల క్రితం ఇందల్‌వాయిలోని తన ఇల్లును గోపి రూ.33.72 లక్షలకు విక్రయించాడు. 

ఇల్లును స్వాధీనం చేసేందుకు మరో రూ.56 లక్షలు డిమాండ్‌ చేయడంతో ఇరువురి మధ్య ఆదివా రం వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమం లో రాజవ్వ చెప్పుతో కొట్టడంతో గోపీ ఆమెను కాలితో తన్నిన విషయం విదితమే.  ఎంపీపీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ పిలుపు మేరకు సోమవారం మండలంలో బంద్‌ పాటించారు. వ్యాపారులు దుకాణా లను మూసివేశారు.

బీజేపీ నాయకులు మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. గతంలో నక్సలైట్‌ జీవితం గడిపిన గోపికి ప్రభుత్వం పునరావాసం కింద ఇచ్చిన భూమిని వ్యాపారాలకు వాడుకుంటున్నాడని, ప్రభుత్వం వెంటనే ఆ భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని కాంగ్రెస్, వడ్డెర జేఏసీ, ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి.

మరిన్ని వార్తలు