మహిళల అభ్యున్నతికి కృషి

9 Mar, 2017 20:45 IST|Sakshi
► రూరల్‌ జిల్లా చెంతన జాతీయ రహదారి
► ఇప్పటికే రెండు పొడవైన రోడ్లు
► తాజాగా నర్సంపేట మీదుగా ఇల్లందు వరకు
    85 కిలోమీటర్ల రోడ్డుకు ప్రతిపాదనలు
► ఏజెన్సీ జిల్లాలకు నేరుగా రవాణా సౌకర్యం
► ప్రాజెక్టుల స్థాపనకు అవకాశాలు
 
నర్సంపేట : తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తోందని మహబూబాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు అజ్మీరా సీతారాంనాయక్‌ అన్నారు. పట్టణంలోని ద్వారకపేట ఎంఏఆర్‌ ఫంక్షన్‌హాల్‌లో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఎంపీ సీతారాంనాయక్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్థిరపడాలని మహిళలకు సూచించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. స్వశక్తితో ఉపాధి రంగాల్లో రాణించాలని కోరారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి 
మాట్లాడుతూ మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ హయాంలోనే అనేక  చట్టాలు వచ్చాయన్నారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించి చట్టాన్ని రూపొందించారన్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు సొంత గ్రామాల్లోనే పనులు చూపించిన ఘనత సోనియాగాంధీకే దక్కిందన్నారు.

మహిళల అభివృద్ధే లక్ష్యం : పెద్దిమహిళల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ చైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాల పెంపుతోపాటు టీచర్‌గా పిలవాలనే హోదా కల్పించడమే ఇందుకు నిదర్శనమన్నారు. నామినేటెడ్‌ కమిటీల్లో సైతం మహిళలకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు. త్వరలో కేబినెట్‌లో కూడా అవకాశం కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ చర్యలు 
తీసుకుంటున్నారన్నారు.
అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి : జేసీ హరిత అందివచ్చిన అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ హరిత అన్నారు. మహిళల్లో కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు తప్పనిసరిగా రిజిస్ట్రర్లలో పేర్లు నమోదు చేయాలని, గర్భిణులు పౌష్టికాహారం తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. బాల్య 
వివాహాలు, బ్రూణ హత్యలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

అనం తరం ఓడీఎఫ్‌ 100 శాతం పూర్తిచేసిన గంగదేవిపల్లి, మరియపురం, ఒగ్లాపూర్, సింగరాయిపల్లి, దాసరిపల్లి, రేలకుంట సర్పంచులు శాంతి, విజయ, శారద, లక్ష్మీ, వల్లాల ఉషశ్రీ, సాంబక్కను జేసీ హరిత, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డిలు శాలువా, మెమోంటోతో  ఘనంగా సన్మానించారు. సభలో ఆర్డీఓ రవి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, నగర పంచాయతీ చైర్మన్‌ పాలెల్లి రాంచందర్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, నగర పంచాయతీ కౌన్సిలర్లు, సీడీపీఓ, ఏసీడీపీఓలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, 
తదితరులు పాల్గొన్నారు. 
 
 
 
 
మరిన్ని వార్తలు