డాన్స్‌ థెరపీ... ఫిట్‌నెస్‌ మంత్ర!

29 Apr, 2020 18:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విజృంభించడంతో దానిని కట్టడి చేయడానికి భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. లాక్‌డౌన్‌ విధించక ముందు ఫిట్‌నెస్‌ కోసం చాలా మంది జిమ్‌లకి, జాగింగ్‌ చేయడం కోసం పార్క్‌లకి వెళ్లే వారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం అవ్వన్ని మూతబడ్డాయి. అయితే ఫిట్‌నెస్‌ ప్రియురాలకు ఒక శుభవార్త. ఇంట్లోనే ఉంటూ ఫిట్‌నెస్‌ పెంచుకోవడానికి విటమిన్‌ ఎఫ్‌3 యూట్యూబ్‌ ఛానల్ వారు డాన్స్‌ థెరపిని తీసుకువచ్చారు. ఈ ఛానల్‌ ద్వారా విటమిన్‌ ఎఫ్‌3 ఛానల్‌ వ్యవస్థాపకులు, సర్టిఫైడ్‌ మల్టీ ఫిట్‌నెస్‌ మాస్టర్‌ కోచ్‌ రఫిక్‌ షేక్‌ ఇంట్లో ఉంటూ డాన్సర్‌ థెరపీ ద్వారా ఎలా ఫిట్‌గా ఉండాలో ట్రైన్‌ చేస్తున్నారు.

కేవలం డాన్స్ థెరపీ మాత్రమే కాకుండా కార్డియో, కిక్‌ బాక్సింగ్‌ లాంటి ట్రైన్‌ కూడా విటమిన్‌ఎఫ్‌3 లో అందుబాటులో ఉంది. అన్ని వయస్సుల వారు (12-60 సంవత్సరాలు) ఈ డాన్స్‌థెరపీ చేయ్యవచ్చు. 50 సంవత్సరాల పైబడి నడుం నొప్పి, కీళ్ల నొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు కూడా నెమ్మదిగా ఈ డాన్స్‌ థెరపీ చెయ్యొచ్చు. 20 నిమిషాల పాటు ఉండే ఈ డాన్స్‌ థెరపీ ద్వారా మీరు ఫిట్‌ నెస్‌ని సొంతం చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే విటమిన్‌ఎఫ్‌3 యూట్యూబ్‌ ఛానల్‌ని సబ్‌స్రైబ్‌ చేసుకొండి, డాన్స్‌ థెరపీ వీడియోస్‌ ద్వారా ఇంట్లో ఉండే ఫిట్‌గా ఉండండి. 

మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్‌లను క్లిక్‌ చేయండి
https://www.youtube.com/watch?v=akG3CyxzNGw&feature=emb_logo
https://www.youtube.com/watch?v=_kJpgDpRfRo&feature=emb_logo
 

>
మరిన్ని వార్తలు