ఆస్పత్రి ఎదుట పురిటి నొప్పులతో గర్భిణి యాతన

15 Oct, 2015 01:17 IST|Sakshi
ఆస్పత్రి ఎదుట పురిటి నొప్పులతో గర్భిణి యాతన

అల్లాదుర్గం: నిండు గర్భిణి ప్రసవం కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. అక్కడున్న సిబ్బంది.. ఇంకా టైమ్ ఉండగానే వెళ్లిపోయారు. రాత్రి విధులకు రావాల్సిన సిబ్బంది ఎంతకీ రాలేదు. దీంతో పట్టించుకునే వారెవరూ లేక ఆరోగ్య కేంద్రం ఎదుట రోడ్డుపైనే ఆ గిరిజన మహిళ నరకయాతన అనుభవించింది. ఈ సంఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీతానగర్ తండాకు చెందిన పడ్త్యా మంజుల బుధవారం సాయంత్రం ప్రసవం నిమిత్తం అల్లాదుర్గం ఆరోగ్య కేంద్రానికి వచ్చింది.

అప్పటికి విధుల్లో ఉన్న సిబ్బంది ఇంకా సమయం ఉండగానే వెళ్లిపోయారు. నైట్ డ్యూటీకి ఎవరూ హాజరు కాలేదు. ఒకపక్క ఆరోగ్య కేంద్రంలో ఎవరూ పట్టించుకోకపోవడం, మరోపక్క నొప్పులు తీవ్రం కావడంతో మంజుల రోడ్డుపైనే అవస్థలు పడింది. చివరకు 108 వాహనంలో ఆమెను జోగిపేట ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు