అమరుల స్ఫూర్తితో ముందుకు సాగాలి

15 Nov, 2014 03:01 IST|Sakshi

మహబూబ్‌నగర్ క్రైం: సమాజం కొరకు దేశం కోసం త్యాగాలు చేసిన వారి కీర్తి అజరామరమని, అలాంటి త్యాగధనుల కు చరిత్రలో స్థానం లభిస్తుందని జిల్లా ఎస్పీ పి. విశ్వప్రసాద్ అన్నారు. శుక్రవారం ఐపీఎస్ ఆధికారి  స్వర్గీయ జి. పరదేశినాయుడు 22వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ కార్యాలయం, వన్‌ఔన్ పోలీసు స్టేషన్ సమీపంలోని అయన విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించా రు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతు పోలీసు శాఖ, సమాజం గర్వించదగ్గ వ్యక్తి పరదేశీనాయుడని కొనియూడారు. 1993 నవంబర్ 14వ తేదీన కొల్లాపూర్ మండలం సోమశిల సమీపంలో మావోయిస్టులు దొంగచాటుగా మందు పాతర  పేల్చడంతో తన రెండు కాళ్లు తెగిపోరుు నా భయపడకుండా  కాల్పులకు ఎదురొడ్డి తన సిబ్బందిని ప్రాణాలు, ఆయుధాలను కాపాడిన ఆభినవ అభిమన్యుడన్నారు.

ఆ ఘటనలో ఎస్పీతో పాటు 9 మంది పోలీసు ఆధికారులు మృతి చెం దారని, వారి స్పూర్తితో జిల్లా పోలీసులు పని చేయూలని కోరారు. పోలీసు శాఖపై ప్రజలకు అభిమాన ం, సహాయ సహకారాలు  ఎల్లప్పుడూ ఉంటాయని, ప్రజల రక్షణకు అధికారులు పాటుపడాలని సూచించారు. ఇదే సందర్బంలో దివంగత ఎస్పీ పరదేశినాయుడు, ఇతర పోలీ సు ఆధికారులు, సిబ్బంది ప్రాణా త్యాగాలు సమాజం గుర్తించుకోవడం కనీ స బాధ్యతన్నారు.

అనంతరం అమర వీరులకు పుష్పంజలి ఘటించి సాయుధ  గౌర వందనం సమర్పించారు. మృతికి సంతాపంగా రెండు నిమిషలు మౌనం పాటించారు. కార్యక్రమంలో  అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డి, డీఎస్పీలు కృష్ణమూర్తి, రమేశ్వర్, సీఐలు శ్రీధర్, సీతయ్య, జ్యో తి, ఉదయకృష్ణ, పోలీసు ఆధికారుల సం ఘం అధ్యక్షుడు కె. శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి తిరుపాజీ, జిల్లా క్యార్యదర్శి గుణవర్దన్, పీఆర్‌ఓ రంగినేని మన్మోహన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు