తెలంగాణ ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ ఝలక్‌

4 May, 2019 19:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ్యులకు ఆదాయపన్ను శాఖ భారీ షాక్‌ ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరచిన స్థిర, చర ఆస్తులకు సంబంధించిన వివరాలు తెలపాలని ఆదేశించింది. ఈ మేరకు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. గత ఎన్నికల్లో ఉన్న ఆస్తులు తాజాగా అఫిడవిట్‌లో పొందుపరచిన ఆస్తులతో వ్యత్యాసాలపై ఎమ్మెల్యేల వివరణ కోరింది. ఐటీ శాఖ పంపిన నోటీసులు అందుకున్న ఎమ్మెల్యేలు తమ ఆస్తుల వివరాలు పంపేందుకు సిద్ధమవుతున్నారు.

ఎమ్మెల్యేల ఆస్తుల వివరాల్లో గతంతో పోలిస్తే భారీ వ్యత్యాసం కనబడటంతో ఆదాయపన్ను శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధుల ఆస్తులు భారీగా పెరిగినట్టు గుర్తించిన ఐటీ శాఖ ఈ మేరకు చర్య తీసుకున్నట్టు సమాచారం. అయితే ఎమ్మెల్యేలు అందరికీ నోటీసులు పంపిందా, కొంతమందికే జారీ చేసిందా అనేది వెల్లడి కాలేదు. ఎవరెవరికి నోటీసులు ఇచ్చారనే దానిపై వెంటనే స్పష్టత రాలేదు.

మరిన్ని వార్తలు