పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి

20 May, 2014 03:47 IST|Sakshi
పెరిగిన పెట్టుబడి.. తగ్గిన దిగుబడి

సూర్యాపేటరూరల్, న్యూస్‌లైన్, అన్నం పెట్టే రైతన్నలకు కష్టాలు తప్పడం లేదు. పంట చేతికందే సమయంలోనూ ప్రకృతి సహకరించకపోవ డం, పండించిన పంట సకాలంలో అమ్ముకోలేక పోవడం వంటి సమస్యలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ప్రతి యేటా పెట్టుబడులు పెరుగుతూనే ఉన్నాయి.

30 నుంచి 40 శాతం వరకు పెరిగిన ధరలు
రెండేళ్లలో ఎరువులు, పురుగు మందుల ధరలు 30 నుంచి 40 శాతం వరకు పెరి గాయి. అంతకు ముందు రూ.500 ఉన్న డీఏపీ బస్తా ధర ఇప్పుడు రూ.1200కు చేరింది. యూరియా బస్తా రూ.250 నుంచి రూ. 280కి చేరింది. ట్రాక్టర్‌తో దుక్కులు దున్నడం ఎకరాకు గతంలో రూ. 800 ఉండగా ప్రస్తుతం రూ. 1200 వరకు వసూలు చేస్తున్నారు. వరి నాటు కు ఎకరాకు రూ.1200 ఉండగా ప్రస్తు తం రూ.1500 వరకు ఖర్చు అవుతుంది. కలుపు తీయడం చీడపీడల నివారణ చర్యల కోసం కూలీకి రూ.100 నుంచి రూ.150కి పెరిగింది.

 వరి కోతకు కూలీ లు సకాలంలో దొరక పోవడంతో వరిప ంట నూర్పిడికి వరికొత మిషన్‌ల మీద పూర్తిగా ఆధారపడాల్సి వస్తుంది. గతం లో రూ.1200లు ఉండగా ప్రస్తుతం రూ. 1800 వసూలు చేస్తున్నారు.  ఇంత పెట్టుబడి పెట్టినా దిగుబడి  ఎకరాకు25 నుంచి 30 బస్తాలు మించడం లేదు. ఇక ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ‘ఏ’ గ్రేడ్ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1345, సా ధారణ రకం రూ.1310 మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుం ది. ఈ ధర చొప్పున 25 బస్తాల వడ్లు విక్రయిస్తే రైతకు వచ్చేది రూ.20 వేలే. వ్యవసాయదారుడు ఎకరాపై పెట్టిన పెట్టుబడి రూ15 వేలు. ఈ లెక్కన చూస్తే రైతులకు మిగిలేది కన్నీళ్లే.

సాయం అందించని పాలకులు
వ్యవసాయ సంక్షోభం నివారణకు స్వామినాథన్ కమిటీ పలు సిఫార్సులు చేసింది. సాగు ఖర్చుపై అదనంగా 50 శాతం పెంచి మద్దతు ధర నిర్ణయించాలని సూచించింది. అయినా, దీనిని ఎవరూ అమలు చేయడం లేదు. ఇటీవ ల వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర నిర్ణయ కమిటీ రెండు, మూడేళ్ల వరకు వరికి మద్దతు ధర పెంచే అవకాశం లేదని ఓ ప్రకటనలో స్పష్టం చేసిం ది. దీంతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర సరిపోవడం లేదని, నూతనంగా ఏర్పడే ప్రభుత్వం అయినా స్పం దించి మద్దతు ధర పెంచి ఆదుకుంటే బాగుంటుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు.

మరిన్ని వార్తలు