ఆక్రమణల జోరు

17 Sep, 2014 02:33 IST|Sakshi

 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో భూ ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ, అసై న్డు భూములు, కాల్వలకు రెక్కలు వస్తున్నాయి. అధికారం, పలుకుబడి ఒక్కటై రూ.కోట్ల విలువ చేసే భూ ములు కాజేస్తున్నాయి. నగరంలో భూముల విలువ విపరీతంగా పెరిగింది. దీంతో కొందరు బడాబాబు లు పట్టాభూములకు తోడు ప్రభుత్వ స్థలాలను కబ్జాచేసి భవనాలు నిర్మించేశారు.

 పురాతన కాలం నుంచి నగరాన్ని చుట్టుముట్టి ఉండే ‘పూలాంగ్’ కాల్వ నిలువెల్లా ఆక్రమణలకు గురైంది. నిజాంసా గర్ కాల్వల పక్కన, ప్రభుత్వ, అసైన్డు భూములను కలుపుకుని విద్యాసంస్థలు వెలిశాయి. కాసుల కోసం కక్కుర్తిపడే కొందరు రెవెన్యూ, కార్పొరేషన్ అధికారుల అండ దండలతో, పట్టా భూముల పక్కన ఉండే వాగులను పూడ్చేసి నిర్మాణాలను యథేచ్చగా సాగించారు. అ యినా దీనిపై నగరంలోనే ఉండే ఉన్నతాధికారులు సైతం స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

 ఇదీ సండతి
 పట్టా భూములకు తోడు ప్రభుత్వ, అసైన్డు భూము లు, కాల్వలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం నిజామాబాద్ నగరంలో వివాదాస్పద అంశంగా మా రింది. అయినా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నగరాన్ని అనుకుని ఉన్న ఆర్సపల్లిలో రాయర్తి గొలుసు చెరువును ఓ విద్యాసంస్థ అధినేత ఆక్రమించి ఏకంగా షెడ్లను నిర్మించేశారు. ము బారక్‌నగర్‌లో ఓ విద్యాసంస్థ నిర్వాహకుడు ఏకంగా గ్రామ పంచాయతీ స్థలాన్నే కబ్జా చేసినట్లు ఫిర్యాదు లు అందాయి.

 ‘పూలాంగ్’ కాల్వను  నిలువెల్లా కబ్జా చేస్తున్నారు. నగరంలో పేరున్న ఓ విద్యా సంస్థల అ ధినేత ఏకంగా కాల్వలోకి చొచ్చుకుపోయి నిర్మాణా లు చేపట్టారు. ఈ వ్యవహారం అప్పట్లో వివాదా స్పదమైంది. బోర్గాం సమీపంలోని వాగుపై ఓ ప్రైవేట్ ఆ స్పత్రి నిర్వాహకుడు ఏకంగా రియల్ ఎస్టేట్ వ్యాపా రం చేస్తున్నారు. సుమారు రెండు ఎకరాల స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ బడానేత గతంలో ఈ భూమిని కబ్జా చేసి ప్రైవేట్ వైద్యుడికి విక్రయించాడు.

సారంగాపూర్ శివారులో హనుమాన్ ఆలయం  వెనుక (రోడ్డు పక్కన) ‘ఇంది ర జలప్రభ’ కోసం కేటాయించిన స్థలానికి కొందరు బడాబాబులు ఎసరు పెట్టారు. రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్నవారు కూడా ఐజేపీ స్థలా న్ని పాట్లుగా చేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు రం గంలోకి దిగితే పెద్దమొత్తంలో ఆక్రమణల బాగోతాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు