భారత సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు రూ.4.21లక్షల కోట్లు

7 Jun, 2020 01:57 IST|Sakshi

ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఓంకార్‌ రాయ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గత మూడు దశాబ్దాల్లో భారత సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులను రూ.4.21 లక్షల కోట్ల కు చేర్చి దేశ ఆర్థిక పురోగతికి సా ఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇం డియా (ఎస్‌టీపీఐ) ఎనలేని కృషి చేసిందని ఆ సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఓంకార్‌ రాయ్‌ అన్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ఎస్‌టీపీఐ 29వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వివిధ సంస్థల భాగస్వామ్యం తో దేశవ్యాప్తంగా ఎస్‌టీపీఐ 21 నైపుణ్యాభివృద్ధి కేం ద్రాలు (సీఓఈ) ఏర్పాటు చేసిందని చెప్పారు. వీటి ద్వారా దేశ వ్యాప్తంగా స్టార్టప్‌ వాతావరణానికి ఊతం లభిస్తుందన్నారు.

వెబినార్‌ సదస్సు వేదికగా!
ఈ సందర్భంగా నిర్వహించిన వెబినార్‌లో ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థ లు, ఐటీ సంఘాలకు చెందిన పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సదస్సును ప్రారంభించిన కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌ సాహ్నీ మాట్లాడు తూ.. ఐటీ రంగం అభివృద్ధిలో ఎస్‌టీపీఐ పాత్ర మరువలేనిదన్నారు. ఎస్‌టీపీఐ ఇటీవలి కాలంలో ప్రవేశ పెట్టిన పథకాల ద్వారా బీపీఓ రంగం గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోందని తె లిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన ‘సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల జాతీయ విధానం’లో భాగంగా ఐ ఓటి, బ్లాక్‌ చెయిన్, ఏఐటీ, ఏఆర్, వీఆర్, ఫిన్‌టెక్, మె డికల్‌ ఎలక్ట్రానిక్స్, గేమింగ్‌ యానిమేషన్, మెషీన్‌ లె ర్నింగ్, డేటా సైన్స్‌ అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, చి ప్‌ డిజైనింగ్‌ వంటి నూతన ఐటీ సాంకేతికతను దృ ష్టిలో పెట్టుకుని ఎస్‌టీపీఐ ప్రణాళికలు సిద్దం చే స్తోందన్నారు. ఐటీ పరిశ్రమలో ఎస్‌టీపీఐ అంతర్భాగంగా మారిందని నాస్కామ్‌ అధ్యక్షుడు దేవయాని ఘోష్‌ అన్నారు. ఎస్‌టీపీఐ వద్ద నమోదైన 18వేలకు పైగా ఐటీ కంపెనీల ద్వారా 40.36 లక్షల ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. జీడీపీలో ఐటీ రంగం వాటా 8 శాతం కాగా, సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులకు భారత్‌ కేంద్రంగా మారుతోందన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా