‘ఇందిరమ్మ’ అవినీతిపై విచారణ

13 Aug, 2014 02:23 IST|Sakshi

తిమ్మాపూర్ (చందంపేట) : ఇందిరమ్మ పథకం కింద 2004 - 2009 సంవత్సరాల మధ్య లబ్ధిదారుల ఎంపిక, బిల్లుల చెల్లింపులో జరిగిన అవినీతి ఆరోపణలపై మంగళవారం సీబీసీఐడీ డీఎస్పీ రామచంద్రుడు ఆధ్వర్యంలోని బృందం తిమ్మాపూర్ గ్రామంలో విచారణ జరిపింది. ఇక్కడ 590 ఇళ్లు మంజూరు కాగా 247 ఇళ్ల నిర్మాణం జరిగినట్లు రికార్డులున్నాయి. కానీ అందులో 44 ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గతంలోనే గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా 44 ఇళ్లకు చెల్లింపులు జరిపారన్న అంశంపై ఇంటింటికీ వెళ్లి విచారణ చేశారు.
 
 పాత ఇళ్లకు మరమ్మతులు చేయడం, నూతన గృహాలు నిర్మించకపోవడం తదితర లోపాలను గుర్తించారు. బృందంలో ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు. హాలియా :  ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిపై మండలంలోని చల్మారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని చల్మారెడ్డిగూడెం, కొట్టాల గ్రామాల్లో సీబీసీఐడీ డీఎస్పీ రాంచంద్రుడు నేతృత్వంలోని అధికారుల బృంద మంగళవారం విచారణ చేపట్టింది. లబ్ధిదారుల వద్దకు వెళ్లి ఇళ్లు కట్టుకున్నారాలేదా? హౌసింగ్ అధికారులు ఎంత బిల్లు, ఎన్ని బస్తాల సిమెంట్ ఇచ్చారన్నది ఆరా తీసున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు