వేగంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం

7 May, 2018 07:32 IST|Sakshi
డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభిస్తున్న  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి 

బీర్కూర్‌(బాన్సువాడ) : కామారెడ్డి జిల్లాలో వేగంగా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని రాష్ట్ర దేవాదాయ, గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా 3 వేల ఇళ్లు నిర్మాణంలో ఉండడం ప్రశంసనీయమన్నారు. మండలంలోని బైరాపూర్‌లో నిర్మించిన విఠల్‌ రుక్మిణి ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు, గ్రామంలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివారం ఆయన హాజరయ్యారు.

ఆయనతోపాటు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్‌ దఫేదర్‌రాజు, జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌సింధేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయాలను దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు, పూజారులకు వేతనాలు చెల్లిస్తోందన్నారు. అలాగే గ్రామంలో నిర్మించిన 40 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించారు.

ఏ ప్రభుత్వాలు చేయని విధంగా సీఎం కేసీఆర్‌ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కామారెడ్డి జిల్లాలో 5138 ఇండ్లకు టెండర్‌ పూర్త యి, సుమారు 3 వేల ఇండ్లు నిర్మాణంలో ఉండడం ప్రశంసనీయమన్నారు. ముఖ్యమంత్రి ఆప్యాయంగా లక్ష్మీపుత్రుడు అని పిల్చుకునే వ్యక్తి మీ బాన్సువాడ ముద్దుబిడ్డ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో తాగు, సాగునీటికి కొరత లేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే నిజాంసాగర్‌కు పూర్వవైభవం వస్తుందన్నారు. మంత్రి పోచారం మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఆధ్యాత్మిక భావా లు కలి గిన వ్యక్తి అన్నారు. పండరిపురం తర్వాత అంతటి అద్భుత ఆలయాన్ని బైరాపూర్‌లో నిర్మించిన ఆల య కమిటీకి మంత్రి అభినందనలు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఈనాటి ముఖ్యాంశాలు

‘సాక్షి’ జర్నలిజం తుది ఫలితాలు విడుదల

పాములకు పాలుపోస్తే ఖబర్దార్‌!

మల్కాజ్‌గిరి కోర్టు సంచలన తీర్పు

భర్త హత్య కేసులో భార్యే నిందితురాలు

అంతకు మించి స్పీడ్‌గా వెళ్లలేరు..!

చింతమడక వాస్తు అద్భుతం: కేసీఆర్‌

‘ఎంట్రీ’ మామూలే!

ఆర్థికసాయం చేయండి

‘కేసీఆర్‌.. జగన్‌ను చూసి నేర్చుకో’

తెలుగు బిగ్‌బాస్‌పై పిటిషన్‌: హైకోర్టు విచారణ

సొంతూరుకు సీఎం..

తగ్గనున్న ఎరువుల ధరలు!

కా‘లేజీ సార్లు’

అక్రమంగా ఆక్రమణ..

ఒక ఇంట్లో ఎనిమిది మందికి కొలువులు

స్వస్థలానికి బాలకార్మికులు.. 

మారు బోనం సమర్పించాలి : స్వర్ణలత

‘చౌక’లో మరిన్ని సేవలు 

సిటీలో కార్‌ పూలింగ్‌కు డిమాండ్‌..!

సిబ్బంది లేక ఇబ్బంది

‘కాళేశ్వరం’ తొలి ఫలితం జిల్లాకే..

సీసీఎస్‌ ‘చేతికి’ సీసీటీఎన్‌ఎస్‌!

పంచాయతీలకు డిజిటల్‌ ‘కీ’

సౌండ్‌ పెరిగితే చలాన్‌ మోతే!

ప్రముఖులకే ప్రాధాన్యం

డాక్టర్‌ అవ్వాలనుకున్నా.. నాయకుడినయ్యా

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

అఖిల్‌కు మరో అవకాశం

పక్కాగా... పకడ్బందీగా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌