ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి

1 Oct, 2019 10:27 IST|Sakshi
బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 

చిట్యాల్‌లో 30రోజుల ప్రణాళిక గ్రామసభ 

సాక్షి, నిర్మల్‌: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యపడుతుందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌ మండలంలోని చిట్యాల్‌ గ్రామంలో సోమవారం నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక గ్రామసభను మంత్రి జ్యోతిప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం చేపట్టిందన్నారు. పల్లె çపచ్చని చెట్లతో కళకళలాడాలని ఈ మేరకు అందరి సహకారం అవసరమన్నారు. అలాగే  ప్రతి ఒక్కరూ పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. గ్రామంలో తుప్పుపట్టిన, వంగిన స్తంభాలను తొలగించి కొత్తవాటిని అమర్చుతున్నట్లు తెలిపారు. జనాభా నిష్పత్తి ప్రకారం  500 జనాభా కలిగి ఉన్న ప్రతీ గ్రామానికి రూ.8లక్షల చొప్పున నిధులు మంజూరు చేయుటకు ప్రభుత్వం రూ.350 కోట్లు విడుదల చేయనున్నదని తెలిపారు.

సాగునీటికి కొరత రాకుండా స్వర్ణవాగుపై 11చెక్‌డ్యాం నిర్మాణాలు చేపడుతామని, ఇప్పటివరకు మూడింటిని పూర్తి చేశామన్నారు. 15వ ఆర్థిక సంఘం, ఉపాధి నిధులు ఉపయోగించి గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపట్టిన పనులను శాఖల వారీగా సమీక్షించారు. అంతకుముందు మంత్రికి గ్రామస్తులు బతుకమ్మలతో స్వాగతం çపలికారు. గ్రామ పంచాయతీ వద్ద మహిళలతో కలిసి మంత్రి బతుకమ్మ అడారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఇందులో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కొరిపెల్లి విజయలక్ష్మి, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, సర్పంచ్‌ రమేశ్‌రెడ్డి, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, డీపీవో శ్రీనివాస్, సీఈవో సుధీర్, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ చౌహన్, ఆర్డీవో ప్రసూనాంబ, తహసీల్దార్‌ అనుపమరావు, ఎంపీడీవో సాయిరాం తదితరులు పాల్గొన్నారు. 

న్యూలోలంలో.. 
దిలావర్‌పూర్‌(నిర్మల్‌): మండలంలోని న్యూలో లం గ్రామంలో కొనసాగుతున్న 30 రోజుల ప్రణాళిక పనులను మంత్రి ఐకే రెడ్డి సోమవా రం పరిశీలించారు. గ్రామంలోని ప్రధాన రోడ్లను పరిశీలించి పనులు సంతృప్తికరంగా ఉండడంతో సర్పంచ్‌ సవిత, ఎంపీడీఓ జి.మోహన్‌రెడ్డి, ఎంపీవో అజీజ్‌ఖాన్, పంచాయతీ కార్యదర్శి సుమలత, ప్రత్యేకాధికారి  స్రవంతిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎస్సారెస్పీ పునరావాస గ్రామమైన న్యూలోలం మరింత అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం తప్పనిసరన్నారు. పంచాయతీ భవన నిర్మాణానికి మరిన్ని నిధులు, వీవో భవననిర్మాణానికి సైతం నిధులు అందజేస్తామని మంత్రి ప్రకటించారు. అనంతరం గ్రామంలో లబ్ధిదారులకు మంత్రి బతుక మ్మ చీరలను పంపిణీ చేశారు. ఇందులో ఎ ంపీపీ ఎల్లాల చిన్నారెడ్డి అమృత, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ రాంకిషన్‌రెడ్డి, జెడ్పీకోఆప్షన్‌ సభ్యుడు డాక్టర్‌ యు.సుభాష్‌రావు, ఆర్డీవో ప్రసూనాంబ, టీఆర్‌ఎస్‌ జిల్లా క్యాదర్శి కె.దేవేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పీవీ.రమణారెడ్డి, మండల కన్వీనర్‌ కోడె రాజేశ్వర్, జెడ్పీసీఈవో సుధీర్, డీపీఓ శ్రీనివాస్, వైస్‌ఎంపీపీ జాదవ్‌ బాబూరావు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు