భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం

16 Aug, 2016 01:56 IST|Sakshi
భక్తులకు ఇబ్బందులు కలగనివ్వం

దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
పుష్కరఘాట్లను సందర్శించిన ముగ్గురు మంత్రులు

 

పెబ్బేరు/కొల్లాపూర్: కృష్ణాపుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బం దులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలంలోని రంగాపుర్‌ఘాట్, కొల్లాపూర్ మండలంలోని సోమశిల ఘాట్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలసి సందర్శించారు.

ఈ సందర్భంగా వారు పుష్కర జలాన్ని తలపై పోసుకుని కృష్ణమ్మకు నమస్కరించారు. భక్తులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. పుష్కరాలు విజయవంతం చేసేందుకు ఏడు నెలల ముందే సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని తెలిపారు. ప్రాముఖ్యత ఉన్న ఘాట్లను ఎప్పటికప్పుడు సందర్శించి భక్తులతో నేరుగా సమస్యలు తెలుసుకుంటామని చెప్పారు. ఎక్కడా అసౌకర్యాల ప్రస్తావనే లేదన్నారు.

మరిన్ని వార్తలు