ధర్నా చేసే హక్కు మాది.. రక్షణ ఇచ్చే బాధ్యత మీది

15 May, 2017 18:24 IST|Sakshi
ధర్నా చేసే హక్కు మాది.. రక్షణ ఇచ్చే బాధ్యత మీది

► బీజేపీ సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డి

హైదరాబాద్‌: ధర్నా చౌక్ వద్ద జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్‌నేత నల్లు ఇంద్రసేనారెడ్డి డిమాండ్‌ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రం లో ప్రజాస్వామ్యం లేదన్నారు. ' ప్రొటెస్ట్ చేసే హక్కు మాకుంది..ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదని' స్పష్టం చేశారు. పోలీసులను, టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డం పెట్టి..ధర్నా చౌక్ ను వ్యతిరేకించే ఉద్యమాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. ధర్నా చౌక్ ఘటన ప్రభుత్వ  దౌర్జన్యానికి, అరాచకానికి పరాకాష్ట అని దయ్యబట్టారు. స్థానికుల ధర్నాకు అనుమతి ఎలా ఇస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ప్రజల సమస్యల కోసం ఎవరితో అయినా..కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. అమాయక రైతులపై కేసులు పెట్టి.. బెయిల్ రాకుండా కుట్ర పన్నారని విమర్శించారు. కేసీఆర్ డైరెక్షన్ లేకుండా రైతులపై కేసులు పెట్టారా అని  అడిగారు. పోలీసులు ఆవేశంతో కేసులు పెట్టి, బేడీలు వేశారని చెప్పినపుడు  ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు కేసులు రద్దు చేయించడం లేదని ప్రశ్నించారు. రైతులకు క్షమాపణ చెప్పటానికి నామూషీ ఎందుకని. రైతులను ఇంక మోసం చేయలేరని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు