పండుగకు వెళుతూ.. పరలోకాలకు..

19 Nov, 2014 03:15 IST|Sakshi
పండుగకు వెళుతూ.. పరలోకాలకు..

రాఘవాపురం(పాలకుర్తి) : తండాలో జరుగుతున్న పండుగకు వెళుతూ ఇద్దరు మృత్యు ఒడికి చేరారు. కారు అదుపుతప్పి బోల్తాపడడంతో కానరానిలోకాలకు చేరారు. ఈ సంఘటన పాలకుర్తి -హన్మకొండ రహదారిపై రాఘవాపురం స్టేజీ సమీపంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... రాయపర్తి మండలం కేశవాపురం గ్రామ శివారు పీతల తండాకు చెందిన మాలోతు స్వరూప, మాలోతు యాకూబ్  దంపతులు కాజీపేట ప్రశాంత్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఇదే తండాకు చెందిన మాలోత్ రాము(32), రజిత దంపతులు కాజీపేటలోని ఫాతిమానగర్‌లో ఉంటున్నారు.

యూకూబ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా, రాము కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పాలకుర్తి మండలం బమ్మెర శివారు ఎల్లమ్మగడ్డ తండాలో స్వరూప తల్లిగారింట్లో పండుగ చేసుకుంటుండడంతో ఆమె భర్త యూకూబ్, కుమార్తెలు ఇందూ(6), బిందుతో కలిసి రాము కారును అద్దెకు మాట్లాడుకుని బయల్దేరారు. ఈ క్రమంలో రాఘవాపురం గ్రామం స్టేజీ దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొని బోల్తాపడింది. దీంతో తీవ్రగాయూలపాలైన  డ్రైవర్ రాము(32)తోపాటు చిన్నారి ఇందూ(6) సంఘటన స్థలంలోనే  మృతిచెందారు. మృతుడు రాముకు కొన్నాళ్ల క్రితమే వివాహ మైందని, అతడి భార్య ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని బంధువులు తెలిపారు.

అలాగే స్వరూప, యాకూబ్, వారి చిన్నకూతురు మాలోతు బిందుకు తీవ్ర గాయాలయ్యూరుు. వారిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం జిల్లా కేంద్రంలోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎల్లమ్మగడ్డ తండా వాసులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. రాము, ఇందూ మృతితో ఎల్లమ్మగడ్డ తండా, పీతల తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంఘటన  స్థలాన్ని పాలకుర్తి సీఐ తిరుపతి, ఎస్సై ఉస్మాన్ షరీఫ్ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు