జిల్లాలో పల్లీ ఆధారిత పరిశ్రమ

2 Feb, 2018 16:13 IST|Sakshi
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్వేతామహంతి  

  ఇక్రిషాట్‌ సహకారంతో నెలకొల్పేందుకు ప్రణాళికలు 

  కలెక్టర్‌ శ్వేతామహంతి 

వనపర్తి : మరో నెలరోజుల్లో ఇక్రిషాట్‌ సహకారంతో జిల్లాలో వేరుశగన (పల్లి) ఆధారిత పరిశ్రమలు నెలకొలిపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని కలెక్టర్‌ శ్వేతామహంతి వెల్లడించారు. గురువారం రాత్రి ఈ విషయమై కలెక్టర్‌ ఇక్రిషాట్‌ ప్రతినిధులతో తన చాంబర్‌లో సమావేశమయ్యారు. పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. వనపర్తి మండలం దత్తాయపల్లి సమీపంలో యూనిట్‌ను ఏర్పాటు చేసి పల్లితో నూనె, పల్లిచెక్కిలు, పీనట్‌ బట్టర్‌ తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ యూనిట్‌ నిర్వాహణ బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తామన్నారు. యూనిట్‌ ఏర్పాటు కోసం కావాల్సిన రా మెటీరియల్, మార్కెటింగ్‌ ఉద్యోగాలు, అవసరమయ్యే నిధులు, వ్యాపార నిర్వాహణ బాధ్యతలపై ఇక్రిషాట్‌ ప్రతినిధులు సైకత్‌దత్తా ఎంజుదార్, అర్వాడి, డీఆర్‌డీఓ గణేష్, ఏపీడీ నాగశేషాద్రిసూరి, ఏపీఎంలతో చర్చించారు. రా మెటీరియల్‌ను వెంటనే కొనుగోలు చేయా లని డీఆర్‌డీఓను కలెక్టర్‌ ఆదేశించారు. అంతకుముందు ఇక్రిషాట్‌ ప్రతినిధులు దత్తాయపల్లి సమీపంలో యూనిట్‌ ప్రారంభించే ప్రదేశాన్ని పరిశీలించారు. 


గొర్రెల పంపిణీపై నిర్లక్ష్యం సహించం 


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం అమలులో నిర్లక్ష్యం వహిస్తే.. సహించబోనని కలెక్టర్‌ శ్వేతాహంతి స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం స్థానిక జిల్లా పశుసంవర్ధకశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. గొర్రెల యూనిట్‌లను సకాలంలో గ్రౌండ్‌ చేయాలని లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. గొర్రెల రవాణాకు సంబంధించి బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లించాలన్నారు. ఎక్కడా రీసైక్లింగ్‌కు అవకాశం లేకుండా పక్కాగా పథకం అమలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పశుసవంర్ధక శాఖ అధికారి వీరనంది, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 
 

మరిన్ని వార్తలు