‘ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అవార్డు’ అందుకున్న అంజలి

5 Jan, 2020 03:31 IST|Sakshi

తెలంగాణ నుంచి ఒకే గిరిజన విద్యార్థిని

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలం కంబాలపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని దారావత్‌ అంజలి ప్రఖ్యాత ‘ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌–ఇస్కా ట్రావెల్‌ అవార్డు’శనివారం అందుకుంది. ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ వార్షిక సమావేశం బెంగళూరులో నిర్వహించారు. జాతీ య బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ద్వారా ఏటా 10 మంది విద్యార్థులకు ఇచ్చే ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌–ఇస్కా ట్రావెల్‌ అవార్డు అంజలికి దక్కింది.  ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్త, నోబెల్‌ బహుమతి అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ ఆదా ఈజునాథ్, ఇస్కా అధికారులు అవార్డును అందజేశారు. కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త భారతరత్న అవార్డు గ్రహీత సీఎస్‌.రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంజలికి గైడ్‌ టీచర్‌గా భౌతిక రసాయనశాస్త్ర ఉపాధ్యాయుడు డాక్టర్‌ వి.గురునాథరావు వ్యవహరించారు. .

మరిన్ని వార్తలు