టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో.. గిరిజనులకు అన్యాయం 

19 Nov, 2018 18:34 IST|Sakshi
గిరిజన మహిళలను ఓటు అభ్యర్థిస్తున్న ఆది శ్రీనివాస్‌

కోనరావుపేట/వేములవాడ : టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో గిరిజనులకు తీరని అన్యాయం జరిగిందని, వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని వట్టిమల్ల, జై సేవాలాల్‌తండా, కమ్మరిపేట, అజ్మీరాతండాలలో ఆదివారం ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. గిరిజనులకు మూడెకరాల భూమి, 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయలేదని. గిరిజనుల భూములకు పట్టాలు ఇవ్వలేదన్నారు. 40 ఏళ్లుగా పాలించిన తండ్రీకొడుకులు అభివృద్ధి చేయలేదన్నారు. తాను అధికారంలో లేకున్నా కోనరావుపేటకు కళాశాల, నాలుగు వంతెనలు తీసుకొచ్చానన్నారు. 

ఎత్తిపోతల పథకాన్ని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభిస్తే అంచనాలు పెంచి తమవిగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. సమావేశంలో సెస్‌ మాజీ చైర్మన్‌ కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, డీసీసీ ప్రధానకార్యదర్శి పల్లం సత్తయ్య, వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశం, మండల పార్టీ అధ్యక్షుడు గంగాధర్, నాయకులు మహేందర్, ప్రకాశ్‌నాయక్, లకావత్‌ మంగ్యా, రాజు నాయక్, మానుక సత్యం, సురేశ్‌యాదవ్, అజీం, ఫిరోజ్‌పాషా, తాళ్లపెల్లి ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

పట్టణంలో ప్రచారం 
వేములవాడ పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి  ఆది శ్రీనివాస్‌ ఆదివారం రాత్రి ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని భగవంతరావునగర్, సాయినగర్, విద్యానగర్, మార్కండేయనగర్, కోరుట్ల బస్టాండ్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు.  ఆయనతో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు