ఇన్నోవా బోల్తా: మహిళ మృతి

1 Aug, 2015 18:33 IST|Sakshi

సదాశివనగర్: నిజామాబాద్ జిల్లా సదాశివనగర్ మండలంలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతిచెందగా.. నలుగురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ సరూర్ నగర్‌కు చెందిన ఓ కుటుంబం ఆదిలాబాద్‌లో బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమానికి వెళ్లి వస్తున్నారు. వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా మండలంలోని దగ్గి గ్రామ శివారులో అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో వాహనంలో ఉన్న భాగ్యలక్ష్మి(46) అక్కడికక్కడే మృతి చెందగా.. మాధవి, మునీంద్రాచారి, బ్రహ్మచారి, సాత్విక అనే నలుగురు  గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు