మొక్క నాటు.. లైసెన్స్‌ తీసుకో!

25 Jul, 2018 01:17 IST|Sakshi
మొక్కలు నాటుతున్న అధికారులు

ఆర్టీఏలో వినూత్నంగా హరితహారం 

సాక్షి,హైదరాబాద్‌: వాహనదారుల్లో పర్యావరణ పరిరక్షణను పెంపొందించేందుకు రవాణాశాఖ దృష్టి సారిం చింది. దీనిలో భాగంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం వచ్చే వారిని ఇంటిదగ్గర ఓ మొక్క నాటి రావాలని కోరుతోంది. వాహనం కొనుగోలు చేసేవారినైతే రెండు మొక్కలు నాటాలని సూచిస్తోంది.

వివిధ రకాల పౌరసేవల కోసం ఆర్టీ ఏ కేంద్రాలకు వచ్చేవారిని మొక్కలు నాటేలా ప్రోత్సహించేందుకు రవాణాశాఖ మంగళవారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన హరితహారంలో జేటీసీ పాండురంగ నాయక్, ఆర్టీవో రమేశ్‌ మొక్కలు నాటడంతో పాటుగా 200 మంది వాహనదారులకు మొక్కలు పంపిణీ చేశారు. డ్రైవింగ్‌ లైసెన్సుకు గుర్తుగా ఓ మొక్కను నాటాలని పాండురంగ నాయక్‌ కోరారు.

మరిన్ని వార్తలు