ఉపాధ్యాయుడిపై విచారణ

22 Mar, 2018 16:07 IST|Sakshi
ఫిర్యాదు చేస్తున్న విద్యార్థులు 

     హనుమాన్‌ దీక్ష తీసుకుంటే  వెళ్లగొట్టిన వైనం

     ఆందోళన చేసిన హనుమాన్‌ దీక్షాపరులు, విద్యార్థులు

మేడిపెల్లి(వేములవాడ): మేడిపెల్లి మండలం కొండాపూర్‌ జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న పాకాల చరణ్‌ తనను క్లాస్‌టీచర్‌ రవీందర్‌ హనుమాన్‌ దీక్ష తీసుకోవడంపై అసభ్యంగా మాట్లాడి.. పాఠశా ల నుంచి వెళ్లగొట్టారని పేర్కొంటూ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎం ఈవో పాఠశాలలో విచారణ చేపట్టారు. స్థా నికులు, విద్యార్థుల కథనం ప్రకారం చరణ్‌ హ నుమాన్‌దీక్ష తీసుకున్నాడు.
 

ఎప్పటిలాగే బుధవా రం పాఠశాలకు వెళ్లగా ఉపాధ్యాయుడు రవీం దర్‌ ‘నాలుగురోజులుగా పాఠశాలకు ఎం దుకు రావడం లేదు. హనుమాన్‌ దీక్ష అవసర మా..? యూనిఫాం వేసుకుని రా..’ అంటూ గద్దించా రు. దీంతో బయటకు వచ్చిన చరణ్‌ తోటి దీక్షస్వాములకు చెప్పడంతో వారు ఉపాధ్యాయుడి ని నిలదీశారు. ఎస్సై కిరణ్‌కుమార్‌ పాఠశాలకు వచ్చి ఆందోళన చేయవద్దని, ఏమైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచిం చారు.
 

దీంతో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసిన స్వాములు.. అనంతరం ఎస్సైకి ఫిర్యాదు చేశా రు. దీనిపై ఎంఈవో గౌతంకృష్ణారావు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయుడిని విచారించారు.  ఉపాధ్యాయుడు మాట్లాడుతూ పాఠశాలకు ఎం దుకు రావడం లేదని మందలించినందుకే కక్షకట్టి ఇలా చేస్తున్నాడని పేర్కొన్నారు. ఎంఈవో వెంట డీఈవో కార్యాలయ ఏడీ ఆంజనేయులు ఉన్నారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తానని ఎంఈవో తెలిపారు.       

 

మరిన్ని వార్తలు