‘ఇందిరమ్మ’లో అక్రమాలపై విచారణ

13 Aug, 2014 03:29 IST|Sakshi

పోల్కంపేట(లింగంపేట) : నిజామాబాద్-మెదక్ జిల్లాల సరిహద్దు గ్రామమైన  లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రా మంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో జరిగిన అవకతవకలపై మంగళవారం సీబీసీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. సీబీసీఐడీ సీఐలు జి.వెంకటేశ్, ఉదయ్‌కిరణ్,ఎస్సైలు  సాల్మన్‌రాజ్,నాగేందర్,హెడ్ కానిస్టేబుల్ రషీద్‌అలీ గ్రామంలో ప్రతి ఇల్లు తిరుగు తూ విచారణ చేపట్టారు.

గ్రామంలో177 ఇందిరమ్మ గృహాలు నిర్మాణాలు జరుగకపోయినా కొందరు అధికారులు,నాయకులు నిధులను దుర్వినియోగం చేసిన ట్లు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు చేసిన ఫి ర్యాదు నేపథ్యంలో విచారణ నిర్వహించారు. గ్రామానికి చెందిన బొల్లారం రాజమ్మ 1989లో ఇల్లు కట్టుకుం ది. కానీ సంబంధిత అధికారులు ఆమె పేరుమీద 2006లో ఇల్లు కట్టుకున్నట్లు బిల్లులు  చెల్లించారు.బిల్లుల విషయం రాజమ్మను సీబీసీఐడీ సీఐ ఉదయ్‌కిరణ్ ప్రశ్నించగా తనకు నయా పైసా ఇవ్వలేదని జవాబిచ్చింది.

అలాగే  గ్రామానికి చెందిన తలారి కిషన్  సైతం తాను ఇల్లు కట్టుకున్నా రూపాయి చేతికందలేదని చెప్పాడు. నిబంధనలకు విరుద్ధంగా  వంట గది నిర్మించుకున్న వారికి సైతం హౌసింగ్ అధికారులు బిల్లులు చెల్లించి తమ శాఖ సత్తా చాటినట్లు విచారణ లో వెల్లడి కావడం గమ నార్హం. అధికారులు ఇం దిరమ్మ ఇల్లు మంజూరైన వారి ఇంటికి వెళ్లి యజమాని ఫొటోలను  తీస్తూ విచారణ చేపడుతున్నారు.

 అవినీతి అక్రమాలకు చెక్‌పెట్టేందుకే..
 సదాశివనగర్ : ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీయడానికే ఇందిరమ్మ గృహాలను పరిశీలిస్తున్నట్లు సీబీసీఐడీ ఇన్‌స్పెక్టర్లు  ఉదయ్‌కిరణ్, వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం  మండలంలోని భూం పల్లి గ్రామంలో గతంలో మంజూరైన 599 ఇందిరమ్మ గృహాలను పరిశీలించారు. అవకతవకలు, అక్రమాలు జరిగాయా..రికార్డు ప్రకారం గృహాలు ఉన్నాయా...లేదా...డీఈలు, ఏఈలు అవినీతికి పాల్పడి ఇళ్లు నిర్మించకున్న బిల్లులు మంజూరు చేశారా అనే కోణంలో పరి శీ లన చేస్తున్నట్లు తెలిపారు.

  గ్రామం లో మూడు బృందాలుగా విడిపోయి అధికారులు ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు మంజూరైనప్పటికీ బిల్లులు తీసుకుని ఇళ్లు నిర్మించకుండా ఉన్న కుటుంబాలను గుర్తిస్తామన్నారు. ఒకే ఇల్లుపై  కొందరు మూడు నాలుగు బిల్లులు తీసుకున్నారా..అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు