సీఎంతో సహా అందరి నుంచి వసూలు చేసున్నాం 

7 Jan, 2019 04:34 IST|Sakshi

బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలపై ఇంటెలిజెన్స్‌ చార్జీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న 90 రోజుల పాటు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు వినియోగించిన 33 మంది ప్రజాప్రతినిధుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, స్పీకర్, ఎమ్మెల్యేలైన కిషన్‌రెడ్డి, అక్బరుద్దీన్‌ ఒవైసీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అప్పటి సీఎల్పీ నేత జానారెడ్డి సహా అందరి నుంచి ఇం టెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ) విభాగం నోటీసుల ద్వారా చార్జీలు చెల్లించాలని ఆయా పార్టీల కార్యాలయాలకు లేఖలు రాసిం దని తెలిపారు. ఈ మేరకు సంబంధిత వాహనాలకు చార్జీలతో పాటు, డ్రైవర్‌ బత్తా వసూలుచేయాలని ఎన్నికల కమిషన్‌ నుంచి ఆదేశాలున్న ట్లు డీజీపీ తెలిపారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు వాడిన వారిలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి రూ.7.7 లక్షలు, తక్కువగా ఉపయోగించిన ఎర్రబెల్లి దయాకర్‌రావు రూ.53 వేలు చెల్లించాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు