బజారులో ఇంటర్ జవాబు పత్రాలు!

12 Mar, 2016 05:21 IST|Sakshi
బజారులో ఇంటర్ జవాబు పత్రాలు!

దుకాణాల్లో తూకం వేయించిన అధికారులు

 రామాయంపేట: మెదక్ జిల్లా రామాయంపేట బజారులో ఇంటర్ జవాబు పత్రాలు దర్శనమిస్తున్నాయి. ప్రతిరోజు పరీక్షలు పూర్తవగానే సీల్  వేసిన జవాబు పత్రాలను బందోబస్తు మధ్య పోస్టాఫీసుకు తరలించి అధికారులు, పోలీసుల సమక్షంలో తూకం వేయించి వారికి అప్పగించాలి. కానీ స్థానిక పోస్టాఫీసులో తూకం యంత్రం సరిగా పనిచేయడంలేదంటూ పాల కేంద్రాల్లో, ఇతర వ్యాపార సంస్థల్లో తూకం వేయిస్తున్నారు.

రామాయంపేటలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం కలిపి రెండు వేల మందికిపైగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ విషయమై సంగారెడ్డి ఆర్‌ఐఓ కిషన్‌ను ‘సాక్షి’ సంప్రదించగా ఎట్టి పరిస్థితుల్లోనూ జవాబుపత్రాలను దుకాణాల్లో తూకం వేయించొద్దన్నారు. దీనిపై పూర్తి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోస్టాఫీసులో తూకం యంత్రం సరిగా పని చేయకపోవడంతో కార్యాలయం ఎదురుగా ఉన్న దుకాణంలో తూకం వేయిస్తున్నట్లు పోస్టల్ అధికారులు అంగీకరించారు.

మరిన్ని వార్తలు