ఇంటర్‌ బోర్టు కొత్త నిర్ణయం

1 May, 2019 18:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇంటర్ ఫలితాల వెల్లడిలో అవకతవకలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సూచనల మేరకు ఇంటర్‌ బోర్టు కొత్త నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాల ప్రక్రియలో గ్లోబరినాతో పాటు మరో స్వతంత్ర కంప్యూటర్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపింది. మరో స్వతంత్ర్య కంప్యూటర్ సంస్థ ఎంపిక బాధ్యతలు టీఎస్‌టీఎస్‌కు అప్పగించినట్లు వెల్లడించింది. టీఎస్‌టీఎస్‌ మరో కంప్యూటర్‌ ఎజెన్సీని ఎంపిక చేసిన వెంటనే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ పక్రియను పూర్తి చేస్తామని పేర్కొంది.

కాగా గత సోమవారం ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై హైకోర్టు విచారణ జరపగా.. ఇప్పటికే ఫెయిలైన మూడు లక్షల 20వేలమంది విద్యార్థులకు రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌ జరుపుతామమని బోర్డు హైకోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు