ఎగ్జామ్‌ సెంటర్‌ తెలుసుకునేందుకు ‘ఆప్‌’

27 Feb, 2017 17:39 IST|Sakshi
హైదరాబాద్‌సిటీ: తెలంగాణ సచివాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్ సెంటర్ లొకేటర్ ఆప్ ను విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రంజీవ్ ఆర్ ఆచార్య ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను పటిష్టం చేస్తోందన్నారు. 
 
విద్యార్థులు పరీక్షా సమయంలో సెంటర్ లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారని, వాటిని  దృష్టిలో ఉంచుకొని ఈ లొకేటర్ ఆప్ ని విడుదల చేశామని తెలిపారు. దేశ చరిత్ర లొనే ఇలాంటి ఆప్ ను రూపొందించడం మొదటిసారని అన్నారు.
 
 విద్యార్థులు ఆప్‌ని ఆండ్రాయిడ్ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకొని, హాల్ టికెట్ నెంబర్ ని ఎంటర్ చేస్తే ఎగ్జామ్ సెంటర్ బిల్డింగ్ తో పాటు లొకేషన్ రూట్ మ్యాప్ చూపిస్తుందన్నారు. ఇంటి నుంచి సెంటర్ కి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో కూడా ఈ ఆప్ ద్వారా తెలుసుకోవచ్చుని తెలిపారు.
మరిన్ని వార్తలు