మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు

12 Dec, 2016 14:51 IST|Sakshi

ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్ పరీక్షలు  షెడ్యూల్ జారీ
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల వార్షిక పరీక్షల తేదీలను ప్రభుత్వం ఖరారు చేసింది. వచ్చే ఏడాది (2017) మార్చి 1 నుంచి 18వ తేదీ వరకు.. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించనుంది. ప్రథమ సంవత్సర పరీక్షలు మార్చి 1 నుంచి 17వ తేదీ వరకు... ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 2 నుంచి 18వ తేదీ వరకు జరుగుతారుు. ఈ మేరకు పరీక్షల టైం టేబుల్‌ను  ఇంటర్ బోర్డు సోమవారం విడుదల చేసింది.

ఇక ‘నైతికత-మానవ విలువల (ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్)’ అంశంపై పరీక్షను 2017 జనవరి 28న,  పర్యావరణ విద్య పరీక్షను 31వ తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని తెలిపింది. ఇక ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. జనరల్‌తో పాటు వొకేషనల్ విద్యార్థులకు కూడా ఇవే పరీక్ష తేదీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థారుు సమావేశంలో ఈ టైం టేబుల్‌ను ఖరారు చేశారు. ద్వితీయ భాషా సబ్జెక్టుతో పరీక్షలను ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు