ఇంటరా.. పాలిటెక్నికా..

11 Aug, 2014 01:27 IST|Sakshi
ఇంటరా.. పాలిటెక్నికా..

తేల్చుకోలేకపోతున్న విద్యార్థులు
- ఫీజుల చెల్లింపుపై స్పష్టత కరువు
- ఇంటర్‌లో ప్రవేశానికి
- ఈ నెల 14 గడువు
- ఖరారు కాని పాలిటెక్నిక్ సీట్లు

 శాతవాహన యూనివర్సిటీ : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి జాప్యం జరుగుతోంది. జూన్ నెలాఖరు వరకు మొదటి సంవత్సర విద్యార్థులకు తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా... ఈసారి అడ్మిషన్లకే ఇంకా మోక్షం లేదు. జిల్లాలో పాలిటెక్నిక్ విద్యను అభ్యసించడానికి 15,202 మంది దరఖాస్తు చేసుకోగా.. అందు లో 8261 బాలురు, 4,503 మంది బాలికలు పరీక్షకు హాజరయ్యూరు. 80 శాతానికి పైగా విద్యార్థులు క్వాలిఫై మార్కులు సాధించారు. పాలిటెక్నిక్ కళాశాలలో చేరిక కోసం సాంకేతిక విద్యాశాఖ కౌన్సెలింగ్ నిర్వహించింది. గత నెల 9 నుంచి 16వ తేదీ వరకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసుకున్న విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వెబ్‌ఆప్షన్లు నమోదుకు అవకాశం కల్పించారు.

బ్రాంచి కళాశాల మార్పులు, చేర్పుల కోసం గత నెల 18న మరో అవకాశం ఇచ్చారు. ఆ ప్రకారంగా ఆన్‌లైన్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు గత నెల 21న సాయంత్రం 6 గంటల తర్వాత సీట్ల కేటాయింపు జరుగుతుందని సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. ఫీజుల చెల్లింపుపై ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో సీట్ల కేటారుుంపును వారుుదావేసినట్లు తెలిపింది. దీంతో సీట్లు ఎప్పుడు కేటాయిస్తారో, తరగతులు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక అయోమయూనికి గురవుతున్నారు.
 
ఇంటర్‌లో ప్రవేశానికి 14 చివరితేదీ
ఇంటర్మీడియెట్‌లో ప్రవేశానికి ఈ నెల 14 చివరి తేదీ కావడంతో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులందరూ ఇంటర్‌లో చేరుతున్నారు. ప్రవేశానికి గత నెలాఖరే చివరితేదీ కాగా, అధికారులు గడువు పొడిగించారు. 14 తర్వాత మరోసారి గడువు పొడిగించే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటివరకు పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ విషయం ఎటూ తేలకపోవడంతో ఇంటర్‌లో చేరుతున్నారు. కొందరు కళాశాల యాజమాన్యాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. కౌన్సెలింగ్ సీటు వస్తే సర్టిఫికెట్లు తిరిగి ఇవ్వాలని, కళాశాలలో ఉన్న రోజులకే ఫీజు తీసుకోవాలనే నిబంధనలు ముందే మాట్లాడుకుంటున్నారు.
 
జిల్లాలోని కళాశాలలివే....

ఉజ్వలపార్క్ సమీపంలో ఉమెన్స్ పాలిటెక్నిక్ కళాశాల, అగ్రహారం, కోరుట్ల, కాటారం, హుస్నాబాద్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నారుు. వీటిలో 840వరకు సీట్లు ఉన్నారుు. కరీంనగర్ కేంద్రంలో ట్రినిటీ, జ్యోతిష్మతి, వాగేశ్వరిలో ప్రైవేట్ కళాశాలలున్నాయి. వీటిలో వెరుు్యకిపైగా సీట్లున్నాయి.
 
 వేరే కోర్సు వెళ్తున్నా...

 నేను పాలిటెక్నిక్ చేద్దామనే ఆగాను. ఇంటర్ జాయిన్ కాలేదు. కౌన్సెలింగ్‌కు సమయం పడుతుందని చేసేదేమీలేక ఇంగ్లిష్ కోచింగ్, కంప్యూటర్ కోచింగ్ వెళ్దాం అనుకుంటున్నా. ఫీజులపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహిస్తే బాగుంటుంది. నా ఫ్రెండ్స్ ఇంటర్‌లో చేరారు.
 - వెంకటయోగి శ్రీవాత్సవ్,
 పాలిటెక్నిక్ ర్యాంకర్, కరీంనగర్
 
ఆటంకం కావద్దు
 మా అబ్బాయి పాలిటెక్నిక్ రాసి ర్యాంక్ వచ్చినా నేటికీ కళాశాలలో చేరలేదు. ప్రభుత్వం కౌన్సెలింగ్ తేదీలిచ్చి ఆపడం కొంత అయోమయంగా ఉంది. కారణాలు ఏమైనా విద్యార్థుల బోధనకు ఆటంకం కగలకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. సమయం గడుస్తున్నా కొద్ది పిల్లలు ఇంటర్ చదువులకు కూడా దూరమై నష్టపోతారు.
 - వి.కృష్ణప్రియ, కరీంనగర్
 
కౌన్సెలింగ్ నిర్వహించాలి
 మన రాష్ట్రంలో కౌన్సెలింగ్ ఆలస్యం అవుతోందని అయోమయంలో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. వెంటనే ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇచ్చి కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలి. లేకుంటే ఆందోళనలు చేస్తాం. విద్యార్థులను అటు ఇంటర్ చదవకుండా.. ఇటు పాలిటెక్నిక్ చదవకుండా చేస్తారేమో...
 - పడాల రాహుల్, ఎన్‌ఎస్‌యూఐ నాయకుడు

మరిన్ని వార్తలు