చివరి స్థానంలో నల్లగొండ

23 Apr, 2016 03:30 IST|Sakshi
చివరి స్థానంలో నల్లగొండ

ఇంటర్ ఫలితాల్లో కొనసాగిన ఆనవాయితీ
* తెలంగాణలో చివరి స్థానంలో నిలిచిన జిల్లా
* గత ఏడాదితో పోలిస్తే ఫస్టియర్‌లో రెండు శాతం తగ్గిన ఉత్తీర్ణత
* సెకండియర్‌లో ఒక శాతం పెరుగుదల.. రెండింటి ఫలితాల్లో బాలికలదే పైచేయి
* వృత్తి విద్యాకోర్సుల్లో మాత్రం అగ్రస్థానం.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు


నల్లగొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా గత ఏడాది ఆనవాయితీనే కొనసాగించింది. మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలో జిల్లా చిట్ట చివరి స్థానంలో నిలిచింది.

గత ఫలితాలతో పోలిస్తే విద్యార్థుల ఉత్తీర్ణత ఇంటర్ మొదటి సంవత్సరంలో రెండు శాతానికి పడిపోగా... ద్వితీయ సంవత్సరంలో మాత్రం ఒక శాతం పెరిగింది. వృత్తి విద్యాకోర్సుల ఫలితాలకు సంబంధించి జిల్లా...  రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తే ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయి. అయితే.. ఎయిడెడ్ కాలేజీల్లో ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలురతో పోలిస్తే బాలికలు పైచేయి సాధించారు.
 
ఫస్టియర్‌లో 41 శాతం ఉత్తీర్ణత
మొదటి సంవత్సరం పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 33,775 మందివిద్యార్థులు హాజరుకాగా.. 13,879 మంది (41శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 17,522 మందికి గాను 8,139 మంది (46 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 16,253 మందికి గాను 5,740 మంది (35శాతం) ఉత్తీర్ణత పొందారు. ఒకేషనల్ విభాగంలో 3,966 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 2,333 మంది  (59 శాతం) పాసయ్యారు. బాలికలు 1,584 మందికి గాను 1,025 (65శాతం), బాలురు 2,382 మందికిగాను 1,308 (55శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
 
సెకండియర్‌లో 53 శాతం ఉత్తీర్ణత
ద్వితీయ సంవత్సర పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 34,354 మం ది విద్యార్థులు హాజరుకాగా.. 18,317 మంది (53 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 17,393 మందికి గాను 10,065 మంది (58 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 17,393 మందికి 8,252 మంది (49శాతం) పాస్ అయ్యా రు. ఒకేషనల్ విభాగంలో  3,186 మంది విద్యార్థులు పరీక్షలకు హాజ రు కాగా.. 2,257 మంది (71శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలి కలు 1147మందికి 876 మంది (76శాతం) .. బాలురు 2,0 39 మందికి 1,381 (68శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
 
ప్రభుత్వ కాలేజీల ఫలితాలు..

జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే మెరుగైంది. జిల్లావ్యాప్తంగా 29 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో నుంచి ఫస్టియర్ విద్యార్థులు 4,917 మంది పరీక్షలకు హాజరు కాగా.. 1,899 మంది (39 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,486 మందికి గాను 856 మంది (34 శాతం)..  బాలికలు 2,431 మందికి గాను 1,043 మంది (43 శాతం) ఉత్తీర్ణత సాధించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ఏడో స్థానంలో నిలిచింది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,126 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,871 మంది (70 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,175 మందికిగాను 1,500 (69 శాతం).. బాలికలు 1951 మందికిగాను 1371 మంది (70 శాతం) మంది  ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణతలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది.
 
29 కాలేజీల్లో పది మాత్రమే..
జిల్లాలోని 29 ప్రభుత్వ కాలేజీల్లో పది కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించి టాప్ టెన్‌లో నిలిచాయి. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ఫలితాలు రావడంపై ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
 
ఫస్టియర్ జనరల్ కేటగిరీలో...
మొదటి సంవత్సరం ఫలితాల్లో నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 114 మంది విద్యార్థులకుగాను 109 మంది (96 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. భూదాన్‌పోచంపల్లి కాలేజీలో 137 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 117 మంది (85 శాతం) మంది.. తుంగతుర్తి కాలేజీలో 129 మందికి 109 మంది (84శాతం).. డిండి కాలేజీలో 168 మందికి 135 మంది (80శాతం), దేవరకొండ బాలికల జూనియర్ కాలేజీలో 129 మందికి 80 మంది (62 శాతం), నాంపల్లి కాలేజీలో 151 మందికి 90 మంది (60శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
 
సెకండియర్‌లో..
నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 153 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 150 మంది (98 శాతం), తుంగతుర్తి కాలేజీలో 174 మందికి 163 మంది (94 శాతం), భూదాన్‌పోచంపల్లి కాలేజీలో 90 మందికి గాను 84 మంది (93 శాతం), డిండి కాలేజీలో 177 మందికి 162 మంది (92శాతం), చింతపల్లి కాలేజీలో 195 మందికి 177 మంది (91 శాతం), నడిగూడెం కాలేజీ లో 121 మందికి 109 మంది (90 శాతం), దేవరకొండ బాలుర కాలేజీలో 145 మందికి 128 మంది (88 శాతం), దేవరకొండ బాలికల కాలేజీలో 142 మందికి 123 మంది (87 శాతం), యాదగిరిగుట్ట కాలేజీలో 191 మందికి 165 మంది (85 శాతం), రామన్నపేట కాలేజీలో 114 మందికి 95 మంది (83 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
 
ఫలితాల్లో ఎయి‘డెడ్’....
ఇంటర్ ఫలితాల్లో ఎయిడెడ్ కాలేజీలు చతికిలపడ్డాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 283 మంది విద్యార్థులు హాజరుకాగా.. కేవలం 30 మంది (11శాతం)  ఉత్తీర్ణులయ్యారు. బాలురు 203 మందికి గాను 22 మంది (11శాతం), బాలికలు 80 మందికిగాను 8 మంది (10శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 241 మంది విద్యార్థులు హాజరు కాగా..  55 మంది మాత్రమే (23శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 168 మందికిగాను 42 మంది (25శాతం), బాలికలు 73 మందికి గాను 13 మంది (18శాతం)  ఉత్తీర్ణులయ్యారు.

మరిన్ని వార్తలు