ఇంటర్మీడియట్‌ బోర్డు లీలలు

28 Feb, 2019 08:31 IST|Sakshi
ఒకే విద్యార్థికి వచ్చిన రెండు హాల్‌టికెట్లు, బాదిత విద్యార్థి  సాయికుమార్‌

ఒకే విద్యార్థికి రెండు హాల్‌టికెట్లు

రోల్‌ నంబర్లలో వ్యత్యాసాలు

రెండు సబ్జెక్టులకు మూడు సబ్జెక్టులుగా ప్రింట్‌

సిరిసిల్లలో ఓ విద్యార్థికి ‘విషమ పరీక్ష’

సిరిసిల్లటౌన్‌: ఇంటర్మీడియట్‌ బోర్డులో నెలకొన్న నిర్లక్ష్యం మూలంగా ఓ విద్యార్థి విషయ పరీక్షను ఎదుర్కొంటున్నాడు. అతడి పేరున రెండు వేర్వేరు రోల్‌ నంబర్లతో హాల్‌టిక్కెట్లు రావడంతో పాటు సబ్జెక్టుల్లో తేడాలుండటంపై విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..సిరిసిల్ల పట్టణానికి చెందిన వేముల సాయికుమార్‌ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరంలో ఫిజిక్స్, మ్యాథమేటిక్‌ సబ్జెక్టుల్లో తప్పాడు. వీటికి సంబంధించి సప్లమెంటరీ ఫీజును చెల్లించాడు. గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగనుండటంతో బుధవారం స్థానిక ఓప్రైవేటు కళాశాలలో హాల్‌టిక్కెట్‌ తీసుకోవడానికి వెళ్లాడు. అక్కడ రెండు హాల్‌టిక్కెట్లు తన పేరున 1937311769, 1937311757 నంబర్లతో రావడాన్ని చూసి అవాక్కయ్యాడు.

ఒక దానిలో తాను తప్పిన ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, మరోదానిలో ఫిజిక్స్, మ్యాథమేటిక్స్‌తో పాటు సంస్కృతం సబ్జెక్టుల్లో పరీక్షలు రాయాల్సిందిగా వచ్చింది. అయితే తాను పాసైన సంస్కృతం పేపర్‌ మళ్లీ రాయడం ఎందుకని ఆవేదన వ్యక్తం చేశాడు. సాయికుమార్‌కు వచ్చిన హాల్‌టికెట్లలో రెండింటిలో తన వివరాలు కరెక్టుగానే ఉన్నాయి. ఫొటోపై సంతకంతో పాటుగా రెండు హాల్‌టిక్కెట్లు జారీ చేయబడ్డాయి. అయితే ఒకదానిలో తాను పాసైన సబ్జెక్టు కూడా తప్పినట్లు రావడంతో తాను రెండు సబ్జెక్టులు రాయలా.. మూడు రాయాలాన్న సందిగ్ధంలొ ఉన్నాడు. ఇంటర్మీడియట్‌ బోర్డు నుంచి జారీ అయిన హాల్‌టిక్కెట్లలొ ఏది నిజం..ఏది అబద్ధం అన్న విషయంలో కళాశాల యాజ మాన్యం, ఇంటర్మీడియట్‌ విద్యాధికారులు స్పష్టత ఇ వ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. ఒక విద్యార్థి భవిష్యత్తులో బోర్డు ఆటలాడటం ఏంటని విద్యార్థి స ంఘాల నాయకుల అభిషేక్‌ తదితరులు బోర్డును తప్పుబడుతున్నారు. న్యాయం చేయాలని సాయికుమార్‌  అధికారులను వేడుకుంటున్నాడు. 


 

మరిన్ని వార్తలు