సిటీలో ఇంటర్నేషనల్‌ బీర్‌ డే

3 Aug, 2019 12:44 IST|Sakshi

సిటీలో ఉత్సాహంగా బీర్‌ డే  

కింగ్‌ఫిషర్‌ పోటీల్లో విజేతలుగా నిలిచిన నగరవాసులు

సాక్షి, సిటీబ్యూరో: మీకు తెలుసా? బీర్‌కూ ఓ రోజు ఉంది. అదే ఇంటర్నేషనల్‌ బీర్‌ డే. ప్రతిఏటా ఆగస్టు తొలి శుక్రవారం దీన్ని నిర్వహిస్తారు. ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన బీర్‌ డే వేడుకలు నగరంలోనూ ఊపందుకున్నాయి. నిన్న సిటీలో ఉత్సాహంగా బీర్‌ డేసెలబ్రేట్‌ చేసుకున్నారు. హోటళ్లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు ప్రత్యేక ఆఫర్లు అందించాయి. విభిన్న ఫ్లేవర్లను అందుబాటులో ఉంచాయి. ఓవైపు చిరుజల్లులు, మరోవైపు వీకెండ్‌ కావడంతో సిటీజనులు ఎంచక్కా బీర్‌తో చీర్‌ అన్నారు. బీర్‌ డే సందర్భంగా కింగ్‌ఫిషర్‌ ‘బీర్‌ను ఎందుకు ఇష్టపడతారు?’ అనే దానిపై చిన్న వ్యాఖ్యలు రాసి బహుమతి గెలుచుకోండంటూ ట్విట్టర్‌ వేదికగా పోటీ నిర్వహించింది. మెట్రో నగరాలైన బెంగుళూర్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, పుణెలలో ఈ పోటీ నిర్వహించగా... నగరానికి చెందిన జి.తనూజ, హర్షవర్ధన్‌ సోలంకి విజేతలుగా నిలిచారు. ఈ మేరకు కింగ్‌ఫిషర్‌ సంస్థ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పేర్కొంది.

ఇదీ ప్రత్యేకత..   
స్నేహితులతో బీర్‌ కొట్టడం, బీరు తయారీదారులకు థ్యాంక్స్‌ చెప్పడం, వివిధ దేశాల బీర్‌లను టేస్ట్‌ చేయడం ఈ రోజు ప్రత్యేకత. వాస్తవానికి 2007 నుంచి ఆగస్టు 5న ఇంటర్నేషన్‌ బీర్‌ డే నిర్వహించారు. అయితే 2012 నుంచి ఆగస్టు తొలి శుక్రవారం జరుపుకుంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమైన ఈ ఈవెంట్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. 

పెరుగుతున్న విక్రయాలు..   
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో బీర్ల వినియోగం ప్రతిఏటా పెరుగుతోంది. గణంకాలను గమనిస్తే ప్రతిఏటా 10 శాతం విక్రయాలు పెరుగుతున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వాన నీటిని ఒడిసి పట్టేందుకు..

వాన వదలట్లే!

మహానగరంలో సాధారణం కంటే తగ్గిన వర్షపాతం

'చెట్టు పడింది..కనపడటం లేదా'

స్వీట్‌ హౌస్‌లోకి దూసుకెళ్లిన కారు

కొత్త మున్సిపాలిటీల్లో పట్టాలెక్కని పాలన

గాంధీ మనవరాలిని కలిసిన కుప్పురాం

రోడ్లపై గుంతలు పూడుస్తున్నాం

వధువుకు ఏదీ చేయూత?

నేడు సెంట్రల్‌లో ఫ్రీ షాపింగ్‌!

తెలుగు ప్రముఖులకు ఈడీ నోటీసులు

అచ్చ తెలుగు లైవ్‌ బ్యాండ్‌

గుట్టుగా.. రేషన్‌ దందా!

అనుమతి లేని ప్రయాణం.. ఆగమాగం 

మహిళ దొంగ అరెస్టు!

గుత్తా పేరు ఖరారు చేసిన సీఎం కేసీఆర్‌

అదునుచూసి హతమార్చారు..  

గ్యాస్‌ ఉంటే.. కిరోసిన్‌ కట్‌

తీవ్రంగా కొట్టి..గొంతు నులిమి చంపాడు

‘మెదక్‌ను హరితవనం చేయాలి’

వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌@2041

వరి పొలంలో చేపల వేట

జూపార్క్‌ వద్ద ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా

పోలీస్‌స్టేషన్లకు డిజిటల్‌ అడ్రస్‌

ఈ శారద గానం ఎంతో మధురం..

శిశువును రూ. 20 వేలకు అమ్మడానికి సిద్ధపడింది

సిరిసిల్లకు రూ.1000 నాణేం

'టైంపాస్‌ ఉద్యోగాలు వద్దు'

అన్నివేళల్లో అందుబాటులో ఉండాలి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

దయచేసి వాళ్లను సిగ్గుపడేలా చేయకండి..!

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు