పీయూలో అంతర్జాతీయ సదస్సు

11 Jul, 2018 13:39 IST|Sakshi
 బ్రోచర్‌ విడుదల చేస్తున్న వీసీ, రిజిస్ట్రార్, అధ్యాపకులు 

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీలో ఆగస్టు 7,8,9వ తేదీల్లో ‘కెమిస్ట్రీ ఫర్‌ సస్టెయినబుల్‌ ఫ్యూచర్‌’ అనే అంశంపై  అంతర్జాతీయ స్థాయి సదస్సు నిర్వహించను న్నట్లు పీయూ వైస్‌చాన్స్‌లర్‌ రాజరత్నం అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌లో మంగళవారం సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సదస్సుల్లో ఫిజిక్స్‌ భవిష్యత్‌ తరాలకు అందించే సేవలపై విస్తృతమైన చర్చ ఉంటుందని, ఇందుకోసం ప్రపంచ వ్యాప్తంగా ఆస్ట్రేలియా, కెనడా, యూకే వంటి దేశాల నుంచి సుప్రసిద్ధ అధ్యాపకులు, శాస్త్రవేత్తలు హాజరవుతారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, శాస్త్రవేత్తలు, రీసెర్చ్‌ స్కాలర్స్, అధ్యాపకులు కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలన్నారు.

ఫిజిక్సు సబ్జెక్టులో అనువజ్ఞను అందించే విషయాలను అర్థం చేసుకునేందుకు మంచి అవకాశమన్నారు. పీయూలో అంర్జాతీయ సదస్సును ఏర్పాటు చేయడం మొదటి సారని, పూర్తి స్థాయిలో విజయవంతంగా నిర్వహించడానికి అందరు సహకరించాలని కోరారు.

కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రార్, పాండురంగారెడ్డి,  కన్వీనర్‌ మూర్తి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చంద్రకిరణ్, అధికారులు మధుసూధన్‌రెడ్డి, సీఓఈ గిరిజ, మనోజ, శ్రీధర్, రామ్మోహన్, ఆయేషాహస్మీ, ఉపేందర్, రవి, మాలతి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు