విభజన చట్టం అమలుపై కేంద్రం సమీక్ష

13 Apr, 2019 05:13 IST|Sakshi

హాజరైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చ ట్టంలోని నిబంధనల అమలుపై కేంద్రహోంశాఖ సమీక్షించింది. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్పాల్‌ చౌహాన్‌ అధ్యక్షతన జరిగి న సమావేశంలో వివిధ కేంద్ర శాఖల కార్యదర్శులు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు పాలొ ్గన్నారు. తెలంగాణ నుంచి ఆర్థిక శాఖ ముఖ్య కార్య దర్శి కె.రామకృష్ణారావు, తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌(ఎఫ్‌ఏసీ) వేదాంతంగిరి హాజరయ్యారు. ఏపీ నుంచి ఆర్‌అండ్‌బీ శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్‌ప్రసాద్, పురపాలన శాఖ ముఖ్య కార్య దర్శి ఆర్‌.కరికాల వళవన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్, పునర్‌ వ్యవస్థీకరణ వ్యవహారా ల ముఖ్య కార్యదర్శి ఎల్‌.ప్రేమ్‌చంద్రారెడ్డి, ఆంధ్ర ప్రదేశ్‌భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ పాల్గొన్నారు.

పునర్‌ వ్యవస్థీకరణ చట్టం పరిధిలో ఏపీ, తెలంగాణ కేంద్రం అమలు చేయాల్సిన అంశా లపై రెండు రాష్ట్రాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చిం చారు. చట్టంలో 13వ షెడ్యూల్‌లో పొందుపరిచిన మౌలిక వసతుల నిబంధనల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు తమ రాష్ట్రానికి సంబంధించి ఆరు అంశాలను హోంశాఖ దృష్టికి తీసుకొచ్చారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేయతలపెట్టిన గిరిజన యూనివ ర్సిటీకి నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే ఉద్యానవన విశ్వవిద్యాల య స్థాపన ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఖమ్మం జిల్లా బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణంపై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాలను అనుసం ధానిస్తూ రహదారుల నిర్మాణం చేపట్టాలని నివేదించారు. 

ఆంధ్రప్రదేశ్‌ నుంచి చర్చించిన అంశాలు 
పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్‌ 13లో పొందుపరిచిన అంశాల్లో జాతీయస్థాయి సంస్థల సత్వర నిర్మాణానికి వేగవంతంగా నిధులు విడుదల చేయాలని, కాకినాడ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి కేంద్రం చొరవ చూపాలని, విశాఖప ట్నం–చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ స్థాపన అంశంలో పురోగతి లేదని ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు నివేదిం చారు. తిరుపతి విమానాశ్రయ ఆధునీకరణ పనులు, విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవం తంగా సాగడం లేదని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకొచ్చారు.

మరిన్ని వార్తలు