‘ఇంటిపంట’ల ఉద్యమానికి ప్రోత్సాహం

26 Apr, 2015 02:11 IST|Sakshi

తెలంగాణ ఉద్యాన శాఖ ఇన్‌చార్జ్ కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి


సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రిక చొరవతో మూడేళ్ల క్రితం ప్రారంభమైన ‘ఇంటిపంట’ల ఉద్యమం ఆరోగ్యదాయక ఆహారోత్పత్తి దిశగా జరిగిన మంచి ప్రయత్నమని, దీనికి మరింత తోడ్పాటునందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ ఉద్యాన శాఖ ఇన్‌చార్జి కమిషనర్ వెంకట్రామ్‌రెడ్డి చెప్పారు. శనివారం హైదరాబాద్ నాంపల్లిలోని హార్టికల్చర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో సేంద్రియ ఇంటిపంటలపై శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు.
 
ఇకపై ప్రతి 15 రోజులకొకసారి సేంద్రియ ఇంటిపంటల సాగుపై శిక్షణా శిబిరం నిర్వహిస్తామన్నారు. సామగ్రి, మట్టిమిశ్రమం, సేంద్రియ కూరగాయ విత్తనాలతో కూడిన కిట్లను 2015-16లో కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. పౌరులందరూ ఇంటిపంటల సైన్యంగా తయారుకావాలని పిలుపునిచ్చారు. ఇరవైశాతంఖర్చుతోనే పాలిహౌస్‌లను నిర్మిం చుకొని దేశవాళీ విత్తనాలతో సులభంగా ప్రకృతి సేద్యం చేసే పద్ధతులపై నగరవాసులకు, రైతులకు విస్తృతంగా శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నామని శ్రీశ్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ టెక్నాలజీ ట్రస్ట్ (బెంగళూరు)కు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డా. బండి ప్రభాకర్‌రావు చెప్పారు.

మరిన్ని వార్తలు