మీ ఒంట్లో ఉప్పుందా !

5 Feb, 2018 23:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

30 శాతం చిన్నారుల్లో అయోడిన్‌ లోపం

పెరుగుతోన్న ఎదుగుదల, కంటిచూపు, థైరాయిడ్‌ సమస్యలు

అవగాహన లోపమే అతిపెద్ద సవాల్‌

సాక్షి, హైదరాబాద్‌: మీ పేస్టులో ఉప్పుందా.. కూరలో ఉప్పుందా.. ఈ మాటలు ఇప్పుడు బాగా వినిపిస్తుంటాయి. ఉప్పులో అయోడిన్‌ ఉందా అనేది ఎక్కువ మంది పట్టించుకుంటున్నారు. కానీ ఒంట్లో ఉప్పు గురించి మాత్రం ఎవరు పట్టించు కోవడంలేదు. భవిష్యత్తుతరం అయోడిన్‌ లోపంతో బాధపడుతోంది. అయోడిన్‌ లేని ఉప్పు వినియోగంతో చిన్నారుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. గాయిటర్, హైపోౖ థెరాయి డిజం, మరుగుజ్జుతనం, బుద్ధిమాంధ్యం సమస్యలు వీటిలో ప్రధా నంగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచే అయోడిన్‌ ఉప్పును వినియోగించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్విహిస్తోంది. అయోడిన్‌ లోపాన్ని నివారించేందుకు కేంద్రం రెండు దశాబ్దాల క్రితం ఉప్పుతో దీన్ని అందించాలని నిర్ణయించింది. అయోడైజ్‌డ్‌ ఉప్పును అందుబాటులోకి తీసుకొచ్చింది. కానీ సంప్రదాయ పరిస్థితుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బస్తాల్లో లభ్యమయ్యే ఉప్పునే వినియోగిస్తున్నారు.

తగ్గుతోన్న ఉప్పు వినియోగం...
స్థూలకాయం సమస్యపై ఆందోళనతో ఇటీవల పట్టణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు పిల్లలకు ఉప్పు వినియోగాన్ని తగ్గిస్తున్నారు. ఫలితంగా అయోడిన్‌ లోపంతో ఉండే చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం అయోడిన్‌ ఉప్పు వినియోగ కార్యక్రమ ఫలితాలపై ఎప్పటికప్పుడు అంచనా నివేదికలు రూపొందిస్తోంది. చిన్నా రుల్లో అయోడిన్‌ లోపాలపై తాజాగా సర్వే నిర్వహించింది. తెలంగాణలోని చిన్నారుల పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో వినియోగించే ఉప్పు నమూనాలను సేకరించి అయోడిన్‌ శాతంపై పరీక్షలు నిర్వహించింది.

 రాష్ట్రంలోని పాత జిల్లాల ప్రాతిపదికగా నిర్వ హించిన ఈ సర్వేలో మొత్తం 2,050 ఉప్పు నమూనాలను పరీక్షించారు. 30 శాతం నమూనాల్లో అయోడిన్‌ ఆనవాళ్లు ఏ మాత్రం లేవని తేలింది. 20 శాతం ఉప్పు నమూనాల్లో మోతాదు కంటే తక్కువగా అయోడిన్‌ ఉన్న ట్లుగా నిర్ధారణ అయ్యింది. అయోడిన్‌ ఉప్పు వినియోగంపై అవగాహన లేక పోవడం వల్లే ఈ సమస్య ఉందని సర్వే నిర్వా హకులు గుర్తించారు.  మొత్తంగా అయో డిన్‌లేని ఉప్పును తీసుకునేవారు ఎక్కువ మంది ఉంటున్నారు. అటవీ ప్రాంతాల్లోని చిన్నారుల్లో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. అయోడిన్‌ లోపం వల్ల పిల్లల్లో గాయిటర్‌ (గొంతు ఉబ్బడం), కంటి చూపులోపం హైపోథైరాయిడ్, మరు గుజ్జుతనం, బుద్ధి మాంధ్యం రుగ్మతలు వస్తున్నాయి. గాయిటర్‌ (గొంతు ఉబ్బడం), కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న చిన్నా రులు తొమ్మిది శాతం ఉన్నట్టు తేలింది. గ్రామీణ ప్రాంత మహిళల్లోనూ అయోడిన్‌ లోపం బాధితులు ఉన్నట్లు సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తలు