వారంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

3 Feb, 2019 02:36 IST|Sakshi

కొత్త జిల్లాలకు ఎస్పీల ప్రతిపాదనలు సైతం సిద్ధం 

మరో 9 మందికి పదోన్నతులు! 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వారం రోజుల్లో భారీ స్థాయిలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు జరిగే అవ కాశం కనిపిస్తోంది. రెండు, మూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న పలువురు అధికారులను లోక్‌సభ ఎన్నికలకు ముందే బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగా ఐజీలు, ఎస్పీలను బదిలీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటుకాబోతున్న మరో రెండు నూతన జిల్లాలకు కూడా ఎస్పీలను నియమించేందుకు పోలీస్‌ శాఖ  ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. సీనియర్‌ ఎస్పీలుగా పనిచేస్తున్న వారికి ఇటీవలే ప్రభుత్వం డీఐజీలుగా పదో న్నతి కల్పించింది.

వీరికి పోస్టింగ్స్‌ కల్పించాల్సి ఉంది. 2005 బ్యాచ్‌కు చెందిన ఎం.రమేశ్, విశ్వప్రసాద్, అవినాష్‌ మహంతి డీఐజీలుగా పదోన్నతి పొందనున్నారు. ఇక డీఐజీలుగా ఉన్న అధికారులు ప్రభాకర్‌రావు, సుధీర్‌ బాబు, అకున్‌సబర్వాల్, ప్రమోద్‌కుమార్‌ ఐజీలు గా పదోన్నతి పొందనున్నారు. ఇక 1994 బ్యాచ్‌కు చెందిన ఐజీలు శివధర్‌రెడ్డి, సౌమ్యామిశ్రా, కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, షికాగోయల్‌ అదనపు డీజీపీలుగా పదో న్నతి పొందనున్నారు.

పదోన్నతి కాకుండా బదిలీ అయ్యే వారిలో నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి, నగర శాంతి భద్రతల అదనపు కమిషనర్‌ చౌహాన్, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఉన్నట్లు తెలిసింది. పోలీస్‌ శాఖను  వేధిస్తోన్న డీఐజీల కొరతఈ పదోన్నతులతో  తీరేలా కనిపిస్తోంది. డీఐజీలుగా ఇప్పటికే కమలాసన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఏఆర్‌ శ్రీనివాస్, శివకుమార్‌ పదోన్న తి పొందగా, వీరితో పాటు రమేశ్, విశ్వప్రసాద్, అవినాష్‌మహంతి డీఐజీ ర్యాంకులోకి చేరబోతున్నారు.    

మరిన్ని వార్తలు