జేఎల్‌ నియామకాల్లో అక్రమాలు

8 Jul, 2019 11:31 IST|Sakshi

సాక్షి,  హన్మకొండ(వరంగల్‌) : టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌ ద్వారా చేపట్టిన నియామకాల్లో అధికారులు అక్రమాలకు తెరలేపారు. కొంతకాలంగా ఎన్పీడీసీఎల్‌లో చేపట్టిన ప్రతీ నియామక ప్రక్రి య వివాదాస్పదమవుతోంది. ఓ వైపు ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న తమ దారి తమ దే అన్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. యాజమాన్యం అధికారులంటే ఒక తీరు.. ఉద్యోగులంటే మరో తీరుగా వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అధికారులు ఎంత పెద్ద తప్పు చేసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుం డగా.. ఉద్యోగులు మాత్రం చిన్న పొరపాటు చేసినా పెద్ద పెద్ద శిక్షలు విధిస్తున్నారని ఉద్యోగ సం ఘాలు ఆరోపిస్తున్నాయి. అయినా అధికారులు మాత్రం తమ కనుసన్నల్లో అక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

కఠినంగా ఉన్నామని చెబుతూనే....
జూనియర్‌ లైన్‌మన్‌ పోస్టుల భర్తీలో అక్రమాలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని అభ్యర్థులు లేవనెత్తుతున్న సందేహాలు నిజమేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు పోల్‌ టెస్ట్‌ పై కఠినంగా వ్యవహరిస్తున్నారని అనిపించుకుంటూనే.. ఇదే అదునుగా అక్రమాలకు తెరలేపారని అభ్యర్థులు చెబుతున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో చేపట్టిన పోల్‌ టెస్ట్‌లో అసలు అభ్యర్థికి బదులుగా మరో వ్యక్తిని అధికారులు స్తంభం ఎక్కించారు. ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని పాత ఐదు సర్కిళ్ల పరిధిలో రెండో విడత పోల్‌ టెస్ట్‌uమొదటిపేజీ తరువాయి నిర్వహించారు. పూర్వ అదిలాబాద్‌ సర్కిల్‌ పరిధిలోనూ ఈ ప్రక్రియ కొనసాగింది. జూన్‌ 20న జరిగిన పోల్‌ టెస్ట్‌లో అసలు అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి స్తంభం పరీక్షకు హాజరయ్యారు. వరంగల్‌ సర్కిల్‌లో ఓ కాంటాక్టర్‌ వద్ద పని చేస్తున్న కార్మికుడు స్తంభాలు ఎక్కడంలో నిపుణుడు. దీంతో రాత పరీక్షలో అర్హత సాధించి స్తంభం పరీక్షకు ఎంపికైన ఓ అభ్యర్థి.. ఇక్కడి నుంచి నిష్ణాతుడిని తీసుకెళ్లి స్తంభం ఎక్కించాడు. 

2,553 పోస్టుల భర్తీకి..
తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్‌ మండలి(టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్‌) క్షేత్ర స్థాయిలో వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు ఖాళీగా ఉన్న జూ నియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి సిద్ధమైంది. జిల్లాల పునర్విభజన జరిగినా పూర్వ జిల్లాల వారీగా వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామబాద్, అది లాబాద్‌ సర్కిళ్ల వారీగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ క్రమంలో 2,553 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించింది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు పూర్వ విద్యుత్‌ సర్కిళ్ల వారీగా జనవరిలో మొదటి విడత పోల్‌ టెస్ట్‌ (స్తంభం ఎక్కే పరీక్ష) నిర్వహించారు. ఈ మేరకు 2,553 పోస్టులకుగాను అంతే సంఖ్యలో అభ్యర్థులను ఆహ్వానించగా 1,,222 మంది అభ్యర్థులు పోల్‌ టెస్ట్‌లో ఉత్తీ ర్ణత సాధించారని సమాచారం.

అయితే, ఎందరు అర్హత సాధించారనేది అధికారికంగా ప్రకటించలేదు. ఈ పోల్‌ టెస్ట్‌ నిర్వహణ, నిర్వహణలో అక్రమాలు జరిగాయని, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, అర్హత సాధించినా అనర్హత వే టు వేశారని అభ్యర్థులు, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఓ కమిటీని నియమించారు. ఈ నిపుణుల కమిటీ బాధ్యులు పరీ క్షకు సంబంధించిన వీడియో పుటేజీ ద్వారా అభ్యర్థుల ఎంపికకు తుది రూపు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, పరిశీలించి అభ్యర్థుల తుది జాబితాను సిద్ధం చేసినా బయటకు వెల్లడించలేదు.

మరో విడత
నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీల మేరకు మొదటి విడత పరీక్షలో అభ్యర్థులు ఎంపిక కాలేదు. దీంతో రెండో విడతగా మరికొందరిని స్తంభం పరీక్షకు పిలిచారు. రెండో విడత పరీక్షలోనూమాలు జరిగాయనేరోపణలు వచ్చాయి. అదిలాబాద్‌లో జరిగిన పోల్‌ టెస్ట్‌లో చివరకు రాత పరీ„ýక్షలో సాధించిన అభ్యర్థి తనకు బదులు స్తంభం పరీక్షకు మరో అభ్యర్థిని తీసుకువచ్చారని సహచర అభ్యర్థులు గుర్తించారు. జూన్‌ 20న జరిగిన స్తంభం పరీక్షలో 104 సీరియర్‌ నంర్‌గా ఉన్న శ్రావణ్‌కుమార్‌ స్థానంలో వరంగల్‌లోని ఓ కాంట్రాక్టర్‌ వద్ద పని చేస్తున్న బి.నవీన్‌ పరీక్షలో పాల్గొన్నాడని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరిగిందని అభ్యర్థుల వాదన. ఓ వైపు పోల్‌ టెస్ట్‌ పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతూనే చాటుగా అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. టీఎస్‌ ఇకనైనా ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం స్పందించి వీడియో చిత్రీకరణను పరీక్షించి పోల్‌ టెస్ట్‌ నిర్వహంచిన, అక్రమాలకు తెర లేపిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు