సైబర్ నేరాలు అరికట్టేందుకు ఇజ్రాయిల్ టెక్నాలజీ

23 Oct, 2014 00:26 IST|Sakshi
సైబర్ నేరాలు అరికట్టేందుకు ఇజ్రాయిల్ టెక్నాలజీ
  • డీజీపీ అనురాగ్‌శర్మ
  • మాదాపూర్ : సైబర్ నేరాలను అరికట్టేందుకు అత్యాధునిక టెక్నాలజీని నగరానికి తీసుకురానున్నట్టు తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. మాదాపూర్‌లోని ఆవాస హోటల్‌లో బుధవారం ఇండో ఇజ్రాయిల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీపై సదస్సు  నిర్వహించారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడుతూ... సైబర్ నేరాలు అరికట్టేందుకు  ఇజ్రాయిల్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారని, త్వరలో అలాంటి పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నగరానికి  రప్పిస్తామన్నారు.  

    ఇజ్రాయిల్‌లోని నిపుణులతో హైదరాబాద్ నగర పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఇజ్రాయిల్‌లో ఎవరైనా సైబర్ క్రైమ్‌కు పాల్పడితే గంటలోనే కనుగొనే సాంకేతిక పరిజ్ఞానం ఉందని, దాని గురించి వివరించారు.  సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేం దుకు ప్రతినెలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.  

    నగరంలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలు చేస్తామన్నారు.  సదస్సులో ఇండో ఇజ్రాయిల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఉదయ్ కెన్ సాగర్,  కౌన్సిల్ ఫర్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ కాన్సులేట్  ఇజ్రాయిల్ ఏవీ ప్రైడ్‌మాన్, ఇండో ఇజ్రాయిల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ డెరైక్టర్ ఎండీ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
     

మరిన్ని వార్తలు