ఇస్రో శాస్త్రవేత్త కేవీసీరావు కన్నుమూత 

26 Sep, 2019 03:12 IST|Sakshi

అంబర్‌పేట: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో)లో శాస్త్రవేత్తగా 2 దశాబ్దాలు సేవలందించిన డాక్టర్‌ కాలూరు విజయచందర్‌రావు (కేవీసీ రావు, 85) కన్నుమూశారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ నెల 22న (ఆదివారం) డీడీ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య భారతి, ముగ్గురు కుమారులు ఉన్నారు.

మొదట ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా కాలూరు తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. కొంతకాలం పెట్రోలియం కార్పొరేషన్‌లో శాస్త్రవేత్తగా పనిచేశారు. అనంతరం ఇస్రోలో చేరి 2 దశాబ్దాల పాటు సేవలందించారు. ప్రముఖ శాస్త్రవేత్తలు విక్రమ్‌ సారాభాయ్, అబ్దుల్‌ కలాం ఈయన సహచరులు. ఆయన అంత్యక్రియలు మంగళవారం రాత్రి పంజగుట్టలోని మహాప్రస్థానంలో నిర్వహించారు.

మరిన్ని వార్తలు