212 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

17 Jun, 2014 02:52 IST|Sakshi
212 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల
  •       21 వరకు దరఖాస్తుల స్వీకరణ
  •      23న డ్రా పద్ధతిలో  దుకాణాల కేటాయింపు
  •      రూ.90 లక్షలకు ఒక దుకాణం
  • అబిడ్స్:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం హైదరాబాద్ జిల్లాలోని 212 మద్యం దుకాణాల కేటాయింపు కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ైెహ దరాబాద్ జిల్లా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ ఎంఎంఎ ఫారూఖీ వెల్లడించారు. సోమవారం నాంపల్లి ఆబ్కారీ భవనంలోని తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.

    ఈ నెల 21వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు జిల్లా వ్యాప్తంగా హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 72 దుకాణాల కోసం, సికింద్రాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని 93 దుకాణాల కోసం, ధూల్‌పేట్ ఎక్సైజ్ పరిధిలో 47 దుకాణాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.

    హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని దుకాణాల కోసం నాంపల్లిలోని హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో, సికింద్రాబాద్, ధూల్‌పేట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలోని దుకాణాల కోసం నారాయణగూడ ఎక్సైజ్ కాంప్లెక్స్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటల నుంచి లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాల కేటాయింపు జరుగుతుందన్నారు.

    నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా ఆధ్వర్యంలో దుకాణాల వేలం, కేటాయింపులు కొనసాగుతాయని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. జిల్లా పరిధిలోని 212 దుకాణాలకు రూ.90 లక్షలు ఫీజు విధించినట్లు ఆయన వివరించారు. గతంలో రూ. కోటి నాలుగు లక్షలు ఉండగా ఈ సంవత్సరం రూ.90 లక్ష లు చొప్పున నిర్ణయించినట్లు వెల్లడించారు. హైద రాబాద్ పరిధిలోని ఏ మద్యం దుకాణానికి అయినా ఒకే ఫీజు ఉంటుందని ఎంఎంఏ ఫారూఖీ చెప్పారు.
     

మరిన్ని వార్తలు