18 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ జారీ

21 Feb, 2015 04:57 IST|Sakshi

సంగారెడ్డి క్రైం : జిల్లాలోని మిగిలిన 18 మద్యం దుకాణాలకు శుక్రవారం కలెక్టర్ రాహుల్ బొజ్జా నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలో ఇటీవల 16 మద్యం దుకాణాలు మిగిలిపోగా రెండు అక్రమ మద్యం అమ్మిన కేసులో రద్దయిన విషయం తెలిసిందే. మొత్తం 18 మద్యం దుకాణాలను నోటిఫై చేశారు. 16 మద్యం దుకాణాలను రూ. 30 లక్షలకు, ఒకటి రూ. 11,33, 335, మరొకటి 10,83,335ల స్లాబ్‌లో నోటిఫై చేశా రు. ఔత్సాహికులు ఈనెల 27వ తేదీ లోగా సంగారెడ్డిలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రఘురామ్ ఒక ప్రకటనలో కోరారు.

ఈనెల 28న ఉదయం 11 గంటలకు తమ కార్యాలయంలో లాటరీ పద్ధతిన మద్యం దుకాణాలను కేటాయిస్తామని ఆయన చెప్పారు.
 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే పటాన్‌చెరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇస్నాపూర్‌లో షాప్ నంబర్ 2,4, ముత్తంగి, పటాన్‌చెరులోని షాప్‌నంబర్ 1, 2, 3, 5, 7, 10, పాటి, రామచంద్రపురం షాప్ నంబర్ 2, 7, 9, తెల్లాపూర్, నర్సాపూర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని బొల్లారం షాప్ నంబర్ 2,5 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. జహీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కోహీర్, సంగారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో సదాశివపేట మండలం పెద్దాపూర్ షాప్‌నకు దరఖాస్తులు ఆహ్వానించారు.
 
ఈ సారైనా దరఖాస్తులు వచ్చేనా?
జిల్లాలో కొన్నేళ్లుగా మిగిలిపోయిన 16 మద్యం దుకాణాలకు ఔత్సాహికుల నుంచి ఆసక్తి కరువైంది. పటాన్‌చెరు, రామచంద్రాపురం, బొల్లారం పారిశ్రామిక వాడలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రావడంతో స్లాబ్ పద్ధతిన ఆయా షాప్‌లకు ప్రభుత్వం రూ. 30 లక్షలు కేటాయించింది. ఈ కారణంగా ఇంత పెద్ద మొత్తం పెట్టుబడి పెట్టినప్పటికీ సరైన లాభాలు ఆర్జించ లేమన్న కారణంగానే ఔత్సాహికులు ముందుకు రావడం లేదు. దీంతో కొన్నేళ్లుగా.. అధికారులు నోటిఫికేషన్ వేస్తున్నప్పటికీ ఈ 16 మద్యం దుకాణాలకు మాత్రం దరఖాస్తులు సమర్పించడం లేదు. ఈ సారైనా ఈ దుకాణాలకు దరఖాస్తులు వస్తాయో?రావో? చూడాలి మరి.

>
మరిన్ని వార్తలు