ఆ రూమర్స్‌ నమ్మొద్దు: సీపీ అంజనీ కుమార్‌

22 Nov, 2019 20:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర పోలీసు కమిషనరేట్‌ పరిధిలో మరోసారి హోంగార్డుల ఎంపిక ప్రక్రియ జరుగనుందంటూ ఇటీవల వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కేవలం వదంతులేనని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం స్పష్టం చేశారు. ఇలాంటివి నమ్మవద్దని, మోసగాళ్ల వలలో పడి మోసపోవద్దని కోరారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన శుక్రవారం ట్విటర్‌లోనూ ట్వీట్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు