ఇది మాటల ప్రభుత్వం

12 Sep, 2015 23:42 IST|Sakshi
ఇది మాటల ప్రభుత్వం

బీబీనగర్ : ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైనదని  టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. శనివారం బీబీనగర్‌లోని నిమ్స్ యూనివర్సిటీ భవనాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా ఇప్పటి వరకు పైసా ఖర్చు చేసిన దాఖలాలు లేవన్నారు. ఎయిమ్స్‌గా, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మారుస్తామన్న సీఎం కేసీఆర్ ఆదిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ హయాంలో నిమ్స్ భ వన నిర్మాణాలను పూర్తి చేసి వైద్య సేవలు నిర్వహించేలా సిద్ధం చేశామనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు.  5 జిల్లాల ప్రజలకు ఉపయోగపడే నిమ్స్‌ను పక్కన బెట్టి కొత్త వాటికోసం ప్రభుత్వం పరుగులు తీస్తుందన్నారు.  శాసనసభ సమావేశాల్లో నిమ్స్ గురించి సీఎంను నిలదీస్తామని, అలాగే రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చిస్తామన్నారు.  సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్, జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్‌‌జ పోత్తంశెట్టి వెంకటేశ్వర్లు, కాం గ్రెస్ మండల అధ్యక్షుడు పొట్టోళ్ల శ్యామ్‌గౌడ్, నాయకులు పంజాల రామాంజనేయులుగౌడ్, అనిల్‌కుమార్‌రెడ్డి, తంగెళపల్లి రవికుమార్, ప్రమోద్‌కుమార్, బర్రె జహంగీర్, సుర్వి వేణుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 
 ప్రభుత్వ విధానాల వల్లే సంక్షోభం : ఉత్తమ్
 భువనగిరి : ప్రభుత్వ విధానాల వల్లే వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని టీపీసీసీ అ ధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. యాదగిరిగుట్ట మండలం సాదువెళ్లిలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కరుణాకర్ కుటుంబాన్ని శనివారం డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్యగౌడ్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలను రాజకీయం చేయదల్చుకోలేదని, మానవీయకోణంలో బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నామని పేర్కొన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. 

చేతులె త్తి మొక్కుతున్నా రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని  డీసీసీ అధ్యక్షుడు  భిక్షమయ్యగౌడ్ అన్నారు.  కార్యక్రమంలో కసిరెడ్డి నారాయణరెడ్డి, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, అనిల్‌కుమార్‌రెడ్డి, రామాంజనేయులు గౌడ్, తంగెళ్లపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్‌కుమార్ జనగాం ఉపేందర్‌రెడ్డి,బర్రె జహంగీర్, సుగుణాకర్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు