ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంవత్సరంగా 2020

2 Jan, 2020 13:53 IST|Sakshi

ఏఐ  టెక్నాలజీతో ఇక సేవలన్నీ స్మార్ట్‌గా 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణా  ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)కు సంబంధించిన లోగోను, వెబ్‌సైట్‌ను గురువారం ప్రారంభించారు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రజలకు సేవలను మరింత సులభతరం  చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 2020 సంవత్సరాన్ని ఏఐ ఏడాదిగా మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏఐ బేస్డ్‌ ఎస్టిమేషన్‌ మేనేజ్‌మెంట్‌ అప్లికేషన్‌ ప్రారంభంతో పాటు 2020 ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ క్యాలెండర్‌ను కూడాయ కేటీఆర్‌ ఆవిష్కరించారు.    

ఎఐ టెక్నాలజీ ద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందనీ సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతీ టెక్నాలజీ మారుమూల గ్రామానికి సైతం చేరువ  చేసేందుకు,  వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు తొమ్మిది కంపెనీలతో  ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ప్రమాదాల సమాచారం, ఒక్క ఫొటోతో పంటకు పట్టిన తెగులు ఏంటి వాటి నివారణ చర్యలు లాంటివి రైతు పొలంలోనే ఉండి తెలుసుకునే టెక్నాలజీ కూడా రాబోతోందన్నారు. అలాగే బీటెక్ కాలేజుల్లో ఐఐటీ హైదరాబాద్ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ ప్రారంభించిందనీ, త్వరలో ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో అన్ని కాలేజుల్లో ఏఐ కోర్స్ ప్రారంభిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా  తెలంగాణ ప్రభుత్వం తో ఒప్పందాలు చేసుకున్న ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

హెల్త్‌ కేర్‌, మొబిలిటీ రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ఇంటెల్‌, పీహెచ్‌ఎఫ్‌ఐ, ఐఐఐటీహెచ్‌లతో.. నివిదతో స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు, ఆడోబ్‌, కెపాసిటీ బిల్డింగ్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకోసం ఐఐఐటీహెచ్‌తో ఎడ్యూకేషన్‌, ట్రైనింగ్‌  నిమిత్తం  వాద్వాని ఆర్టిఫిషియల్‌తో, హెక్సగాన్‌ వ్యాపబుల్‌ సెంటర్‌ ఏర్పాటుకు, నార్వే క్లస్టర్‌ ఆఫ్‌ ఐప్లెడ్‌ ఏఐతో, మహింద్రా కాలేజీతో, నాస్కామ్‌తో మంత్రి సమక్షంలో పలు కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరాయి. హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఏఐ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌, ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు