కరీంనగర్‌ ఐటీ టవర్‌ రెడీ

21 Jul, 2020 01:54 IST|Sakshi

70 వేల చదరపు అడుగులు.. 

ఐదు అంతస్తులు 15 ఐటీ కంపెనీలకు ఆఫీసు స్పేస్‌ కేటాయింపు

నేడు మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌ : ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో ఐటీ టవర్లను నిర్మిస్తోంది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఆధ్వ ర్యంలో వీటి నిర్మాణం కొనసాగుతోంది. ఇందులో భాగంగా కరీంనగర్‌ పట్టణ శివారులో నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు మంగళవారం ప్రారం భిస్తారు. ఇప్పటికే వరంగల్‌లో మడికొండ మొదటి దశ ఐటీ టవర్‌తో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ నిర్మాణం పూర్తయింది. టెక్‌ మహీంద్ర వంటి దిగ్గజ కంపెనీలు ఇక్కడ కార్యకలాపాలు ప్రారం భించగా, రెండో దశ ఐటీ టవర్‌ నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయి. కరీంనగర్, నిజామా బాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రా ల్లోనూ రూ.25 కోట్ల చొప్పున వ్యయంతో ఐటీ టవర్ల నిర్మాణం కొనసాగుతోంది. మహబూబ్‌ నగర్‌లో నిర్మాణ పనులు ప్రాథమిక దశలో ఉండగా నిజామాబాద్, ఖమ్మంలో పనులు చివరి దశలో ఉన్నాయి. 

70 వేల చదరపు అడుగుల్లో ఐటీ టవర్‌
రూ.25 కోట్ల వ్యయంతో 70వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐదంతస్తుల్లో నిర్మించిన కరీంనగర్‌ ఐటీ టవర్‌ నిర్మాణ పనులు గతేడాది చివరిలోనే పూర్తయ్యాయి. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో దీని ప్రారంభానికి ముహూర్తం నిర్ణయించినా మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ మూలంగా వాయిదా పడింది. కరీంనగర్‌ ఐటీ టవర్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభిం చేందుకు 26 కంపెనీలు ప్రభుత్వాన్ని సంప్రదించగా, 15 కంపెనీలకు ఆఫీస్‌ స్పేస్‌ కేటాయించారు. ఇందులో ప్రస్తుతం 12 కంపెనీలు కార్య కలాపాలు ప్రారంభిస్తుండగా 400 మంది యువ తకు ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. భవిష్య త్తులో కరీంనగర్‌ ఐటీ టవర్‌ ద్వారా దాదాపు 3,600 మందికి ఉపాధి దక్కనుంది. కాగా, ప్రస్తుతం 60 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో ఐటీ టవర్‌ ప్రారంభమవుతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఇతర ఐటీ టవర్ల పనుల పురోగతిపై మంత్రి కేటీఆర్‌ మంగళవారం జరిగే కార్యక్రమంలో పూర్తి వివరాలు వెల్లడిస్తారన్నారు.

ఐటీ టవర్‌ ప్రత్యేకతలివే
– ఐదంతస్తుల్లో నిర్మించిన ఐటీ టవర్‌లో 12 చదరపు అడుగులు సెల్లార్‌ కాగా, మరో 60 వేల అడుగులు ఆఫీసు స్పేస్‌కు కేటాయిస్తారు. 
– గ్రౌండ్‌ ఫ్లోర్‌లో శిక్షణ కేంద్రం, మొదటి అంతస్తులో కార్యాలయం, రెండు, ఐదో అంతస్తుల్లో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేస్తారు. 
– మూడు, నాలుగో అంతస్తులను హెచ్‌సీఎల్‌ వంటి దిగ్గజ కంపెనీలకు భవిష్యత్తులో కేటాయిస్తారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా