ఐటీఐ విద్యార్థులకు జాబ్‌ పక్కా

12 Mar, 2017 03:05 IST|Sakshi
ఐటీఐ విద్యార్థులకు జాబ్‌ పక్కా

ప్రతి ఐటీఐని బడా కంపెనీతో అనుసంధానిస్తున్న సర్కారు
సాక్షి, హైదరాబాద్‌: మానవ వనరుల విని యోగంలో ఐటీఐ (ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌)లు కీలకంగా మారనున్నాయి. కేంద్రం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని అమ లుచేస్తున్న నేపథ్యంలో... కేంద్రం దృష్టిని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యాచరణ చేపడుతోంది. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచి వారిని ఉపాధిబాటలో పెట్టేందుకు ఉపాధి కల్పన శాఖ ఐటీఐలను లక్ష్యం గా చేసుకుంటోంది. ఐటీఐల్లోని వివిధ కోర్సు ల్లో శిక్షణ ముగిసిన వెంటనే విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించేలా తయారు చేస్తోంది. రాష్ట్రంలో 65 ప్రభుత్వ ఐటీఐలున్నాయి.

వీటిలో 55 ఐటీఐలకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీవీటీ) గుర్తింపు ఉంది.  ఎన్‌సీవీటీ గుర్తింపు ఉన్న ఐటీఐలను భారీ పరిశ్రమలతో అనుసంధానించాలని ఉపాధి కల్పన, శిక్షణ శాఖ నిర్ణయించింది.  ఇప్పటివరకు 10ఐటీఐలు, బహుళ జాతీయ, దేశీయ సంస్థలు ఎంవోయూ కుదుర్చుకున్నా యి. అయితే, బహుళజాతి కంపెనీలు గ్రామీణ ప్రాంత ఐటీఐలపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతు న్నాయని ఆ శాఖ సంయుక్త సంచాలకుడు నగేశ్‌ ‘సాక్షి’తో అన్నారు.

సనత్‌నగర్‌ ఐటీఐతో హుందాయ్, టయో టా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో ని విద్యార్థులకు కార్లు, ఇతర పెద్ద వాహ నాలకు డెంటింగ్, పెయింటింగ్‌ల్లో శిక్షణ ఇస్తున్నాయి.
సికింద్రాబాద్‌ ఐటీఐతో ఫోర్డ్‌ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుని సీఆర్‌డీఐ ఇంజన్, డీజిల్‌ వాహనాల స్పేర్స్‌ అమర్చ డంలో శిక్షణనిస్తోంది.
మల్లేపల్లి ఐటీఐతో మారుతీ సుజుకీ ఒప్పందం కుదుర్చుకుంది.
ఆల్వాల్‌ ఐటీఐని మిథాని దత్తత తీసుకుం ది.
ఓల్డ్‌సిటీలోని ఐటీఐని బీడీఎల్‌ దత్తత తీసుకుంది. ఇందులో మౌలిక వసతులు, శిక్షణ కేంద్రాల ఏర్పాటుకు రూ.2.88కోట్లు అందించింది. జవహర్‌నగర్‌ ఐటీఐతో బెల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.
కొత్తగూ డెం ఐటీఐని సింగరేణి కాలరీస్, కరీంనగర్‌ ఐటీఐని ఎన్‌టీపీసీ, సంగారెడ్డి ఐటీఐని మహేంద్ర అండ్‌ మహేంద్ర సంస్థలు దత్తత తీసుకుని శిక్షణనిస్తున్నాయి.

మరిన్ని వార్తలు