ఆరంభం మాత్రమే..అంతం కాదు..

9 Nov, 2014 03:47 IST|Sakshi

ఆసరా పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. సమైక్యాంధ్ర పాలనలో అన్నిరంగాల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందన్నారు. గత ప్రభుత్వాలు వృద్ధులు, వితంతులకు ఇచ్చిన రూ. 200 పింఛన్‌ను కేసీఆర్ ప్రభుత్వం రూ.వెయ్యికి పెంచిందని, వికలాంగులకు ఇచ్చే రూ.500 పింఛన్‌ను రూ.1500లకు పెంచుతూ ప్రభుత్వం ఆసరాగా నిలుస్తోందని పేర్కొన్నారు.

వృద్ధులు, వికలాంగులు, వితంతులను ఎవరూ పోషించకున్నా భరోసా కల్పించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారన్నారు. గత ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.60 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.70 వేలలోపు సంవత్సర ఆదాయం ఉన్న వారికే పింఛన్లు అందజేసేవని, కేసీఆర్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు రూ.లక్ష 50 వేలు, పట్టణ ప్రాంత వాసులకు రూ. 2 లక్షలలోపు ఆదాయం ఉన్న పేద ప్రజలకు ఈ అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. 2015 మార్చికల్లా భూమిలేని ఎస్టీలకు మూడెకరాల వ్యవసాయ భూమి పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు.

 ఇళ్ల స్థలాలు లేనివారికి స్థలాలు, పక్కాగృహాలు నిర్మించి ఇస్తామన్నారు. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించి, మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి సదరం క్యాంపులకు వచ్చే వికలాంగులకు ఇబ్బందులు తలెత్తకుండా మండల కేంద్రాల్లోనే సదరం క్యాంపులను నిర్వహించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.

ఈ సందర్భంగా వృద్ధాప్య 1,10,565, వితంతు 72,552, వికలాంగ 27,909 మందికి పింఛన్ల కోసం రూ. 22 కోట్ల 49 లక్షల 80 వేల 500 అందించామని చెప్పా రు. ఎంపీ గోడం నగేష్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించా రు. అనంతరం అర్హులైన తాంసి, తలమడుగు, బేల, ఆదిలాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ మనీషా, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, కలెక్టర్ ఎం. జగన్‌మోహన్, ఆదిలాబాద్ జెడ్పీటీసీ అశోక్, డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ నైతం లక్ష్మి, టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు