'నబిల్ ను రెచ్చగొట్టి హత్య చేశారనే అనుమానం'

10 May, 2015 17:02 IST|Sakshi
'నబిల్ ను రెచ్చగొట్టి హత్య చేశారనే అనుమానం'

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో సంచలనం సృష్టించిన స్ట్రీట్ ఫైట్ ఘటన పథకం ప్రకారమే జరిగిందనే అనుమానం కలుగుతోందని డీసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. నబిల్ ను కొట్టేందుకు ముందుగానే కుట్ర పన్నినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం నబిల్ ను రెచ్చగొట్టి హత్య చేశారనే అనుమానం కలుగుతుందన్నారు. ఈ ఘటన జరిగింది మే 3 న  అయితే.. తమకు ఫిర్యాదు అందింది మాత్రం ఏడవ తేదీన అని తెలిపారు. నబిల్ ను కొట్టి చంపిన వ్యక్తి అబేజ్ అహ్మద్ గా గుర్తించినట్లు పేర్కొన్నారు. అతన్ని కొట్టమని అబేజ్ కు సుల్తాన్ అనే విద్యార్థి సూచించినట్లు తెలిపారు. ఆ స్ట్రీట్ ఫైట్ కు రిఫరీగా ఉన్నది డాలర్ వసీం అని డీసీపీ స్పష్టం చేశారు.

 

ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి ఐదుగుర్ని అరెస్ట్ చేశామని.. దీంతో పాటు కొంతమంది మైనర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు.కాగా పోస్ట్ మార్టం నివేదిక వచ్చాక దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు. ఈ ఘటనలో అబేజ్, సుల్తాన్, వసీం, ఉమర్, ఇర్ఫాన్ లు అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు