కోదండరామ్‌ అరెస్ట్‌, విడుదల

17 Jul, 2017 16:01 IST|Sakshi
మర్కూక్‌: సిద్ధిపేట జిల్లా మర్కూక్‌ మండలంలో నిర్మిస్తున్న కొండపోచమ్మ జలాశయ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించేందుకు వెళ్లిన టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ను పోలీసులు అరెస్టు చేసి గజ్వేల్‌ వద్ద బేగంపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ములుగు మండలం బైలంపూర్‌లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమైన కోదండరామ్‌ ఓ బాధిత రైతు ఇంట్లోకి వెళ్లారు.
 
పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుపడ్డారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు నెట్టేసి కోదండరామ్‌తో పాటు హైకోర్టు న్యాయవాది రచనారెడ్డిని వాహనంలో ఎక్కించి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. కోదండరాంను తక్షణం విడుదల చేయాలని టీజేఏసీ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వ నిర్బంధ వైఖరికి నిరసనగా పోలీస్ స్టేషన్‌లోనే ఆయన నిరాహార దీక్షను ప్రారంభించారు. అనంతరం ఆయనను బేషరతుగా పోలీసులు విడుదల చేశారు.
 
మరిన్ని వార్తలు